Home » Prakasam
ప్రకాశం జిల్లాలో ఈనెల5వ తేదీన తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) పర్యటించనున్నారు. ఈ మేరకు చంద్రబాబు షెడ్యూల్ ఖరారయింది. రేపు మధ్యాహ్నం 2:45గంటలకి ఉండవల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా చంద్రబాబు కనిగిరి బయలుదేరనున్నారు.
ఏపీలోని ప్రకాశం జిల్లాలోని ఓ ప్రాంతంలో న్యూ ఇయర్ సందర్భంగా 7వ తరగతి విద్యార్థులు మద్యం సీసాలతో కనిపించారు. ఈ సంఘటన డిసెంబర్ 31న జరుగగా అందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Andhrapradesh: కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలారెడ్డి చేరికపై వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరినా వైసీపికి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు తమకు తోడుగా నిలబతాయన్నారు.
AP Politics: ఏపీలో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా పలు జిల్లాలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను మారుస్తోంది. ప్రకాశం జిల్లా విషయానికి వస్తే... ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఈసారి దాదాపు ఐదుగురిని తప్పించాలని నిర్ణయించింది.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్...: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుసగా ప్రసారం చేసిన కథనాలతో వైసీపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రకాశం జిల్లా, ఒంగోలులో ఏర్పాటు చేసిన సీఎం జగన్ ఫ్లెక్సీలను వైసీపీ నేతలు రాత్రికి రాత్రి తొలగించారు. జగన్‌ను ఏసుక్రీస్తుతో పోలుస్తూ వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
కృష్ణాజిల్లా: తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన ఆందోళన మంగళవారం నాటికి 8వ రోజుకు చేరింది. ఇవాళ కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో అంగన్వాడీలు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
జిల్లాలోని ఒంగోలు సమీపంలో బైకుని ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న చిరంజీవి అనే యువకుడు మృతిచెందాడు.మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు భాస్కర్‌రెడ్డి విల్లాలకు ఇసుక తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది.
Andhrapradesh: కొండపి నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా వెళ్లడం సంతోషంగా ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని తన కుమారుడు తపన పడ్డాడని, సీఎం జగన్‌కు కాడా తమపై ఉండాలి కదా.. ఉండాలని కోరుకుంటున్నానని బాలినేని వ్యాఖ్యనించారు. 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా..
ఒంగోలు: రిమ్స్ మెడికల్ కాలేజీలో గ్యాంగ్ వార్ ఘటనపై వైద్య విద్యా విభాగం డైరెక్టర్ సీరియస్ అయ్యారు. కాలేజీలో గొడవ పడిన 15 మంది విద్యార్థులను హాస్టల్, కాలేజీ తరగతుల నుంచి బహిష్కరించారు.