Share News

Cockfights : పులివెందులలో తొలిసారి

ABN , Publish Date - Jan 14 , 2025 | 04:38 AM

కడప జిల్లా పులివెందులలో తొలిసారి కోడిపందేల జోరు కనిపించింది. పందేల్లో తొలి రోజే రూ.2 కోట్లు దాటినట్లు సమాచారం.

Cockfights : పులివెందులలో తొలిసారి

డప జిల్లా పులివెందులలో తొలిసారి కోడిపందేల జోరు కనిపించింది. పందేల్లో తొలి రోజే రూ.2 కోట్లు దాటినట్లు సమాచారం. పలువురు టీడీపీ నాయకులు వీటి నిర్వహణకు మక్కువ చూపారు. మొత్తంగా పులివెందులలో ఎనిమిది చోట్ల భారీగా కోడిపందేలు నిర్వహించారు. పార్టీలకతీతంగా వీటిలో పాల్గొనడం మరో విశేషం. లింగాల మండలం దొండ్లవాగులో రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల మేర పందేలు జరిగినట్లు తెలిసింది. పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్‌ రవి బరుల వద్దకు వెళ్లి పరిశీలించినట్లు తెలిసింది.

  • ప్రకాశం జిల్లావ్యాప్తంగా పలుచోట్ల కోడి పందేలు హుషారుగా సాగాయి. కలెక్టర్‌, ఎస్పీ హెచ్చరికలు చేసినప్పటికీ ఎవరి పని వారిదే అన్నట్లుగా నిర్వాహకులు వ్యవహరించారు. సంతనూతలపాడు చిన్న చెరువులో భారీ బరి ఏర్పాటు చేసి 200 కోళ్లతో పందేలు వేశారు. ఇక్కడ పై పందేలే రూ.లక్షలో జరిగినట్లు తెలిసింది.

  • ఏలూరు జిల్లాలో కోడి పందేలు ధూమ్‌ధామ్‌గా ప్రారంభమయ్యాయి. 7 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన బరుల్లో రూ.లక్షలు చేతులు మారాయి. పేకాట జోరుగా సాగింది. గుండాటకు జనం ఎగబడ్డారు. ఒక్కొక్క పందెం రూ.ఐదు వేల నుంచి రూ.మూడున్నర లక్షల వరకు సాగింది.

  • ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోడిపందేలు విచ్చలవిడిగా సాగాయి. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాలతోపాటు విజయవాడ నగరంలోను బరులు ఏర్పాటు చేశారు. పటమటలంక, కబేళా ప్రాంతాల్లో ఈ ఏడాది తొలిసారి బరులు ఏర్పాటు కావడం గమనార్హం.జక్కంపూడిలోని పాములకాల్వ వద్ద టీడీపీ నాయకుడు ఏర్పాటు చేసిన బరిని ఎంపీ కేశినేని చిన్ని ప్రారంభించారు. కృష్ణా జిల్లాలో అతిపెద్ద బరిగా ఉన్న అంపాపురంలో రూ.10 కోట్లకు పైబడి పందేలు సాగాయి. ఇక్కడ పందేలను బట్టి బరులు ఏర్పాటు చేశారు. రూ.10 లక్షలు ఆ పైబడిన పందేల కోసం రెండు పెద్దబరులను ఏర్పాటు చేశారు. తర్వాత రూ. లక్ష నుంచి రూ.5 లక్షల పందేల కోసం ఐదు చిన్నబరులను ఏర్పాటు చేశారు.


  • బాపట్ల జిల్లాలో సోమవారం ఒక్క రోజే కోడి పందేలు, పేకాట రూపంలో రూ.5 కోట్ల వరకు చేతులు మారినట్లు అంచనా. చెరుకుపల్లి మండల పరిధిలోని తూర్పుపాలెం బరిలో కోడి పందేలను రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ వీక్షించారు. తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో పందెం రాయుళ్లు తూర్పుపాలెం బరి వద్దకు వచ్చారు.

  • బాపట్ల బరుల్లో ప్రవేశం కోసం టోకెన్ల జారీ చేపట్టి అనుమతి లేకుండా పేకాట శిబిరాల వద్దకు వెళ్లే అవకాశం లేకుండా చేశారు. పేకాటకు ఒక్కో గేమ్‌కు రూ.5 లక్షల చొప్పున పెట్టి ఆడగా, కోడి పందేల విషయంలో లక్ష నుంచి రూ.ఐదు లక్షల వరకు పందేలు పెట్టారు.

Updated Date - Jan 14 , 2025 | 04:38 AM