Maha Kumbhmela 2025 : మహా కుంభమేళాకు రాష్ట్రపతి.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం..
ABN , Publish Date - Feb 10 , 2025 | 12:53 PM
Maha Kumbh Mela 2025 : ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం హాజరయ్యారు. భద్రతా సిబ్బంది మధ్య ఉదయం త్రివేణి సంగమానికి చేరుకుని పవిత్ర స్నానం ఆచరించారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న అతి పెద్ద ఆధ్యాత్మిక పండుగ మహాకుంభమేళాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సందర్శించారు. ఆమె రాకను పురస్కరించుకుని త్రివేణి సంగమం వద్ద భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ప్రయాగ్‌రాజ్ విచ్చేసిన రాష్ట్రపతికి ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం భద్రతా సిబ్బంది వెంటరాగా ఫ్లోటింగ్ బోటుపై పర్యటించే సమయంలో వలస పక్షులకు ఆహారం కూడా అందించారు. ఆ తర్వాత త్రివేణి ఘాట్ వద్దకు చేరుకుని పుణ్య స్నానం ఆచరించారు. తర్వాత పూజలు చేశారు.
ప్రయాగ్‌రాజ్‌లో వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా గతనెల జనవరి 13 న ఆరంభమైంది. ఈ రోజు 29వ రోజు. 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే కుంభమేళా కావడంతో దేశ విదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. యూపీ ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం ఇప్పటివరకూ దాదాపు 44 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 26న ముగియనున్న మహా కుంభమేళాకు జన ప్రవాహం పెరుగుందే కానీ తగ్గటం లేదు. రద్దీ ఉన్నప్పటికీ తెల్లవారుజామున 3 గంటల నుంచే వేలాది మంది భక్తులు పవిత్ర స్నానమాచరించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ రోజు కూడా ప్రయాగ్‌రాజ్ చుట్టు పట్ల వందల కిలోమీటర్ల వరకూ ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది. కుంభమేళా ప్రాంగణంలో రద్దీ కారణంగా నిమిషాల్లో వెళ్లగలిగే ప్రాంతాలకు కూడా గంటల సమయం పడుతోంది.
ఇవి కూడా చదవండి..
Delhi Victory: ఢిల్లీ విజయంలో ఒకే ఒక్కడు.. మోదీని మించి..
Delhi elections: హామీల అమలు బీజేపీకి సవాలే!
US immigration: 23 నెలల్లో 92 లక్షల మంది!
మరిన్ని జాతీయ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి..