President Speech: పేపర్ లీకేజీపై స్పందించిన రాష్ట్రపతి..
ABN , Publish Date - Jun 27 , 2024 | 11:52 AM
దేశంలో పేపర్ లీకేజీ ఘటనలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. 18వ లోక్‌సభ తొలి సమావేశాల్లో ఆమె ఈరోజు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.
దేశంలో పేపర్ లీకేజీ ఘటనలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. 18వ లోక్‌సభ తొలి సమావేశాల్లో ఆమె ఈరోజు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. నీట్, నెట్ పేపర్ లీకేజీపై ఆమె తన ప్రసంగంలో మాట్లాడుతూ.. దర్యాప్తు కొనసాగుతుందన్నారు. పేపర్ లీకేజీపై నిష్పక్షపాతంగా విచారణ జరుగుతోదంన్నారు. నిందితులపై చర్యలు తప్పవన్నారు. పేపర్ లీకేజీపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం ప్రభుత్వ జవాబుదారీతనాన్ని తెలియజేస్తుందన్నారు. అలాగే దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆరు దశాబ్దాల తర్వాత దేశంలో సంపూర్ణ మెజారిటీతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజలు మూడోసారి విశ్వాసం చూపించారని తెలిపారు.
ఆకాంక్షలను నెరవేరుస్తాం..
ప్రతి భారతీయుడి ఆకాంక్షలను ఈ ప్రభుత్వం నెరవేర్చగలదని రాష్ట్రపతి తెలిపారు. 18వ లోక్‌సభ అమృత కాలం ప్రారంభ సంవత్సరాల్లో ఏర్పడిందన్నారు. త్వరలోనే ఈ ప్రభుత్వం తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుందని తెలిపారు. ఈ బడ్జెట్ ప్రభుత్వ ఆర్థిక విధానాలను తెలియజేయడంతో పాటు అనేక కీలక నిర్ణయాలు బడ్జెట్‌లో ఉండే అవకాశాలున్నాయనే సంకేతాలను రాష్ట్రపతి తన ప్రసంగం ద్వారా ఇచ్చారు. దాదాపు 64 కోట్ల మంది ఓటర్లు తమ కర్తవ్యాన్ని ఉత్సాహంగా నిర్వర్తించారన్నారు. ఈసారి మహిళలు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారని తెలిపారు. కశ్మీర్ లోయలో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైందని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More National News and Latest Telugu News