Home » Pressmeet
న్యూఢిల్లీ: తెలుగుదేశం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ఒకసారి చరిత్ర తిరగేయాలి.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారపక్షానికి ఎలా సహకరించాలో తెలుసుకోవాలని సూచించారు.
అమరావతి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తోడ్పాటును ఇచ్చేలా ఉందని, ఇది ప్రగతిశీల బడ్జెట్ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్‌పై తనను కలిసిన మీడియాతో సీఎం కొద్దిసేపు చిట్ చాట్‌గా మాట్లాడారు.
భద్రాద్రి కొత్తగూడెం: పెద్దవాగు ఘటన చాలా బాధాకరమని, ప్రాజెక్ట్ ఆనకట్ట తెగిన సమాచారం తెలియగానే ఎంతో తల్లడిల్లిపోయానని, హెలి కాఫ్టర్ ఆలస్యం అయితే ఏమైనా ప్రాణ నష్టం వాటిల్లిందని ఎంతో మదన పడ్డానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
అమరావతి: వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై విద్యా, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ కౌంటరిచ్చారు. ఈ సందర్బంగా గురువారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అక్రమం, అవినీతి గురించి జగన్ మాట్లాడడం రోత పుట్టిస్తోందన్నారు.
విజయవాడ: తెలుగుదేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు వాతలు పెట్టినా ఇంకా జగన్‌కు బుద్ధి రాలేదని, పేర్ని నానికి శ్వేత పత్రం అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు.
సిద్దిపేట జిల్లా: ఆషాడ బోనాల సందర్భంగా గజ్వేల్ పట్టణంలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీ చరిత్రలో జగన్ రెడ్డి పాలనలో సభా విధానాలు, కార్యక్రమాలను నిర్వీర్యం చేసి నవ్వులు పూయించారని, ప్రజా ప్రయోజనాల కోసం తమ అభిప్రాయాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ, రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించారని, పోలీసు బలగాలను క్రూరంగా ప్రయోగించారని టీడీపీ సీనియర్ నేత, శాసనమండలి సభా పక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు.
కడప జిల్లా: అనకాపల్లి ఎంపీగా ఎన్నికై కడపకు రావడం చాలా ఆనందంగా ఉందని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు. శుక్రవారం కడపకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమ నుంచి వచ్చి అనకాపల్లిలో ఎలా రాజకీయాలు చేస్తారని వైసీపీ నేతలు ప్రశించారని అన్నారు. అయితే..
విజయవాడ: ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం గోదావరి, కృష్ణా నదుల పవిత్ర సంగమం వద్ద పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దీక్ష, దక్షతకు, సీఎం చంద్రబాబు ముందుచూపుకు పట్టిసీమ నిదర్శనమని అన్నారు. నదుల అనుసంధానం ద్వారా కరవు నిర్మూలించవచ్చని కెయల్ రావు చెప్పారని, దానిని అమలు చేసి రైతులకు నీరు ఇచ్చిన నేత చంద్రబాబు అని కొనియాడారు.
విజయవాడ: టీడీఆర్ బాండ్ల కంభకోణంలో జగన్‌ను అరెస్టు చేయాలని, ఈ కుంభకోణంలో జగన్ సూత్రధారి అని, కారుమూరి నాగేశ్వరరావు సారధ్యంలో కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని తెలుగుదేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న అన్నారు.