Share News

TDP: 11 సీట్లు ఎందుకు ఇచ్చామా అని ప్రజలు ఆలోచిస్తున్నారు..: బుద్దా వెంకన్న

ABN , Publish Date - Jul 17 , 2024 | 12:47 PM

విజయవాడ: తెలుగుదేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు వాతలు పెట్టినా ఇంకా జగన్‌కు బుద్ధి రాలేదని, పేర్ని నానికి శ్వేత పత్రం అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు.

TDP: 11 సీట్లు ఎందుకు ఇచ్చామా అని ప్రజలు ఆలోచిస్తున్నారు..: బుద్దా వెంకన్న

విజయవాడ: తెలుగుదేశం సీనియర్ నేత (TDP Leader) బుద్దా వెంకన్న (Buddha Venkanna) మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి (Ex CM Jagan)పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు వాతలు పెట్టినా ఇంకా జగన్‌కు బుద్ధి రాలేదని, పేర్ని నాని (Perni Nani)కి శ్వేత పత్రం (White Paper) అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు. ఈ సందర్బంగా బుధవారం ఆయన విజయవాడ (Vijayawada)లో మీడియాతో మాట్లాడుతూ.. ఎప్పుడైనా వైసీపీ వాళ్లు (YCP Leaders) శ్వేత పత్రాలు విడుదల చేశారా? అని నిలదీశారు. సీఎం చంద్రబాబు పోలవరం వెళ్లడం తప్పా? పోలవరం పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఆయన పర్యటన చేస్తున్నారని, వైసీపీ పరిపాలన ఎలా చేశారో చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు.


వైసీపీ వాళ్ళ దొంగతనాలు ఎక్కడ బయటపడతాయోనని భయపడి ప్రెస్ మీట్‌లు పెడుతున్నారని బుద్దా వెంకన్న విమర్శించారు. చంద్రబాబు సీఎం అవ్వగానే పెంచిన పింఛన్లు అందించారని.. అదే జగన్ ముఖ్యమంత్రి అవ్వగానే ప్రజావేదిక కూల్చారని ఎద్దేవా చేశారు. అసలు చెత్త పన్ను వేసింది ఎవరు?.. జగన్ ఐదు సంవత్సరాలు పాటు రాష్ట్రాన్ని చెత్త గా మార్చేశారని.. చంద్రబాబు ఆ చెత్తంతా క్లీన్ చేస్తున్నారని, 35 రోజుల్లోనే ఆ చెత్త అంత క్లీన్ అయిపోతుందా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని ఎప్పుడైనా జగన్ ఢిల్లీ వెళ్ళినప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేశారా? అని నిలదీశారు. దోచుకున్న లక్షల కోట్లతో సోషల్ మీడియాని నడిపిస్తున్నారని, ఆ డబ్బులతో సోషల్ మీడియాతో కూటమి నేతలపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.


ప్రతిపక్ష హోదా కూడా లేదు..

ప్రజలు వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. ఇప్పటికే ప్రజలు వైసీపీ పార్టీని అసహ్యించుకుంటున్నారని, ఆ 11 సీట్లు ఎందుకు ఇచ్చామా అని ప్రజలు ఆలోచిస్తున్నారని, పూర్తిగా భూస్థాపితం చేస్తే బాగుండనని అనుకుంటున్నారన్నారు. పేర్ని నాని బందర్‌ను ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఇప్పటివరకు పోర్టు అనేది పూర్తి చేయలేదని విమర్శించారు. చంద్రబాబు పోర్ట్ నిర్మాణం పూర్తి చేస్తారన్నారు. మచిలీపట్నానికి రూ. 70వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ తీసుకొస్తున్నారని, ఇక జగన్ అధికారంలోకి రావడం కలే అన్నారు. చంద్రబాబుకు మరో అవకాశం వచ్చినట్లు, వైసీపీకి కూడా మళ్లీ అధికారం వస్తుందని పగటి కలలు కంటున్నారన్నారు.


జగన్‌ను ప్రజలు మరోసారి నమ్మరు..

చంద్రబాబు నాయుడు రెక్కల కష్టంతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని, బాబును ప్రజలు నమ్మారు కాబట్టి అధికారంలోకి వచ్చామని బుద్దా వెంకన్న అన్నారు. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మరోసారి నమ్మే అవకాశమే లేదన్నారు. వైసీపీ నేతలు కాజేసిన డబ్బు గురించి ప్రజలకు చెప్పడం తప్పా? అని ప్రశ్నించారు. జగన్ భవంతుళ్ళో ఉండొచ్చు కానీ, పేదవాళ్లు సొంత నివాసాల్లో ఉండకూడదా? అని నిలదీశారు. టిడ్కో ఇళ్లు జగన్ ఎందుకు పూర్తి చేయలేకపోయారు. గాలి మాటలు చెప్పడం వైసీపీ నేతలు మనుకోవాలన్నారు. 2024 నుంచి 2029 కాలంలో రాష్ట్రం పరుగులు పెడుతుందని, అసలు రాష్ట్రంలో ఎన్ని శాఖలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డికి తెలుసా?.. ఇప్పటికే ప్రజలు ఓటు రూపంతో వైసీపీ నేతలకు వాతలు పెట్టారని, నిజంగా కొలిమిలో కడ్డీ పెట్టి వాత పెట్టే దాకా తెచ్చుకోవద్దని బుద్దా వెంకన్న హతవుపలికారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అధికారిక నివాసంలో పూజలు.. పాల్గొన్న సీఎం చంద్రబాబు..

రుణమాఫీ రూపొందించిన విధానం సరిగాలేదు

బీజేపీలోకి కరీంనగర్ మేయర్?

అధికారం మారిన అవే పనులు..

డిప్యూటీ స్పీకర్‌ పదవిపై ఆ నేతల ఆశలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 17 , 2024 | 12:55 PM