Home » Pressmeet
విశాఖ: తూర్పు నియోజకవర్గం ప్రజలకు తాను ఎంతో చేశానని కూటమి అభ్యర్థి, టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణ బాబు అన్నారు. తాను చేయగలిగినంత సహాయం చేస్తానని.. మాటలతో మోసం చేయడం తెలియదని అన్నారు. గతంలో ఎలా ఉన్నా.. రేపు కూడా అలానే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పొత్తుపెట్టుని.. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో ఏ పొత్తు లేదన్నట్టుగా సభల్లో ఆయనను దూషిస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.
విజయవాడ: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ, పశ్చిమ నియోజకవర్గం సీపీఐ అభ్యర్ధి కోటీశ్వరరావుకు మద్దతుగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం కోసం బీజేపీ ఎలాంటి పనికైనా బరితెగిస్తుందని ఆరోపించారు.
హనుమకొండ : ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు ఆదివారం భీమదేవరపల్లి మండలం, ముల్కనూర్‌లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అబద్దాలేనని అన్నారు.
విజయవాడ: కూటమి బీజేపీ ఎంపీ అభ్యర్థి సుజనా చౌదరి జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక దుర్మార్గపు చట్టంగా అభివర్ణించారు.
అమరావతి: జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి తధ్యమని, కాంగ్రెస్ అధికారం లోకి రావడం ఖాయమని.. పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ తులసి రెడ్డి వ్యాఖ్యానించారు.
అనకాపల్లి జిల్లా: ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, వైసీపీ దౌర్జన్యాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని, పోలీసులు కళ్ళముందే ముత్యాల నాయుడు, వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారని, జరిగిన సంఘటనపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఫోన్ చేసిన స్పందించలేదని కూటమి అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు.
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్‌బాబు కామెంట్స్ చేశారు. ఈ సందర్బంగా గురువారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఉద్యోగులకు గౌరవంలేదని, అన్నీ ఇబ్బందులేనని, కూపన్లు, గిఫ్ట్‌లు ఇచ్చి ఉద్యోగులను మరోసారి ప్రలోభ పెడుతున్నారని విమర్శించారు.
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరికి, ఎంతమందికి దత్తపుత్రుడో చెప్పాలని, న్యాయ ప్రక్రియ అడ్డుకోవడం దురదృష్టకరమని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఎంపీ కనకమేడల రవీంధ్రకుమార్ అన్నారు.
సిద్దిపేట జిల్లా: కోహెడలోని వెంకటేశ్వర గార్డెన్లో ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో ఆరుగురు బీఆర్ఎస్ మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. నాలుగు నెలల తమ పాలనలో ఆరు గ్యారంటీలలో చేయాల్సినవి అమలు చేశామని స్పష్టం చేశారు.