BRS: పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది: కేటీఆర్
ABN , Publish Date - Nov 12 , 2024 | 08:43 AM
ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర కోసం రైతన్నలు రోడ్డెక్కారని.. హైడ్రా’ దౌర్జన్యాల పట్ల సర్కారుపై జనం తిరుగుబాటు చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. మూసీలో ఇండ్ల కూల్చివేతలపై బాధితులు దుమ్మెత్తిపోస్తున్నారని, పెండింగ్ బకాయిలు చెల్లించాలని మాజీ సర్పంచ్‌లు నిరసనలు తెలుపుతున్నారని, ఉపాధి దూరం చేసిన అసమర్థ ప్రభుత్వంపై నేతన్నలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారని కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) ఎక్స్ (X) సోషల్ మీడియా (Social Media) వేదికగా రేవంత్ రెడ్డి సర్కార్‌పై (Revanth Reddy Govt.,) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ‘‘తెలంగాణ తిరగబడుతోంది - తెలంగాణ తల్లడిల్లుతోంది.. కుటుంబ దాహం కోసం తన ప్రాంతంపై కుట్రలు చేస్తే లగచర్ల లాగయించి ఎదురొడ్డుతుంది.. మా భూములు మాకేనని కొడంగల్ కొట్లాడుతుంది.. పసలేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది.. కుట్రల కుతంత్రపు పాలనలో కట్టలు తెంచుకునే కోపంతో నా తెలంగాణ గరమైతుంది.. అసమర్థ మూర్ఖ ముఖ్యమంత్రి ఎలుబడిలో రాష్ట్రంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న అసంతృప్తులివి’’.
ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర కోసం రైతన్నలు రోడ్డెక్కారని.. హైడ్రా’ దౌర్జన్యాల పట్ల సర్కారుపై జనం తిరుగుబాటు చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. మూసీలో ఇండ్ల కూల్చివేతలపై బాధితులు దుమ్మెత్తిపోస్తున్నారని, పెండింగ్ బకాయిలు చెల్లించాలని మాజీ సర్పంచ్‌లు నిరసనలు తెలుపుతున్నారని అన్నారు. ఉపాధి దూరం చేసిన అసమర్థ ప్రభుత్వంపై నేతన్నలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారని అన్నారు. ఆర్థిక సాయంతో ఆదుకోవాలంటూ ఆటో డ్రైవర్లు మహా ధర్నా చేస్తున్నారని, గ్రూప్స్ పరీక్షల నిర్వహణ తీరుపై విద్యార్థి లోకం భగ్గుమంటోందన్నారు. ఫార్మా కోసం భూములు లాక్కోవద్దని అన్నదాతలు కన్నెర్ర జేస్తున్నారని, కులగణనలో అడుగుతున్న ప్రశ్నలపై అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోందని, గురుకులాల్లో అవస్థల పరిష్కారానికి రోడ్డుపై విద్యార్థులు బైఠాయించారని కేటీఆర్ పేర్కొన్నారు.
కాగా తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రూ.8,888 కోట్ల విలువైన అమృత్ పథకం టెండర్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలని కోరుతూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం బీఆర్‌ఎస్ బృందంతో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. ‘ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్’ అనే నిబంధనను ఉల్లంఘించి సీఎం రేవంత్‌రెడ్డి తన బావమరిది సుజన్‌రెడ్డికి చెందిన శోధా కంపెనీకి రూ.1,137 కోట్ల విలువైన పనులను అప్పగించారని ఫిర్యాదులో కేటీఆర్ తెలిపారు. ఏమాత్రం అనుభవం, అర్హత లేని సంస్థకు పనులు అప్పగించడం ద్వారా ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. గతంలో ‘ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్’ నిబంధనను ఉల్లంఘించిన సందర్భాల్లో ప్రజాప్రతినిధులపై వేటు పడిందని గుర్తు చేశారు.
ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ గనుల కేటాయింపు, బిహారిలాల్ దోబ్రే వర్సెస్ రోషన్ లాల్ దోబ్రే కేసు (1983), ది శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు వర్సెస్ వైరిచెర్ల ప్రదీప్ కుమార్ దేవ్ కేసు (2005), ది జయాబచ్చన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (2001), దివ్య ప్రకాష్ వర్సెస్ కులతార్ చంద్ రాణా (2003) కేసులను ఉదాహరణలుగా కేటీఆర్ ప్రస్తావించారు. 2014లో సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు హరియాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం భూములు కేటాయించిందని, కర్ణాటక ముడా స్కాంలో సీఎం తన భార్యకు భూములు కేటాయించారని, అలాగే రేవంత్‌రెడ్డి అమృత్ టెండర్లలో తన బావమరిదికి మేలు చేశారని ఆరోపించారు.
అమృత్ టెండర్ల అవినీతిపై పారదర్శకంగా విచారణ జరిపించాలని, అక్రమాలు నిజమని తేలితే టెండర్లను రద్దు చేసి, సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, కేసుల నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్ ఢిల్లీ పర్యటన అంటూ మంత్రులు చేసిన ఆరోపణలపై ‘ఎక్స్’లో స్పందిస్తూ, ‘‘జస్ట్ ఢిల్లీలో ల్యాండ్ అయ్యా. ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రకంపనలు వస్తున్నాయని విన్నా. అప్పుడే వణికిపోతే ఎలా?’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏఐసిసి అంతర్గత సమావేశంలో పాల్గొనున్న సీఎం రేవంత్
వర్రా రవీంద్ర రెడ్డికి 14 రోజుల రిమాండ్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News