Share News

Kotam Reddy: జగన్ అసెంబ్లీకి రావాలంటే ఒక చిట్కా ఉంది..: ఎమ్మెల్యే కోటంరెడ్డి

ABN , Publish Date - Nov 18 , 2024 | 10:43 AM

జగన్‌ను చూసి చాలా రోజులు అవుతుంది.. కానీ ఆయన మాత్రం అసెంబ్లీకి రావడం లేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. దీనికి పరిష్కారం ఏంటంటే.. రోజుకు జగన్‌కు గంట మాట్లాడేందుకు సమయం ఇస్తే వస్తారన్నారు. ఇంకొ విషయం ఏంటంటే.. ఆయన ఏం మాట్లాడినా అద్దం రాకూడదని.. ఇది జగన్ ఫిలాసఫీ అని అన్నారు.

Kotam Reddy: జగన్ అసెంబ్లీకి రావాలంటే ఒక చిట్కా ఉంది..: ఎమ్మెల్యే కోటంరెడ్డి

అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (Ex CM Jagan) అసెంబ్లీ (Assembly)కు రావాలంటే ఒక చిట్కా (Tip) ఉందని, రోజుకు ఒక గంట జగన్‌కు మాట్లాడేందుకు సమయం ఇస్తే ఆయనే సభకు వస్తారని, లేని పక్షంలో అతను రారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotam Reddy Sridhar Reddy) అన్నారు. ఈ సందర్భంగా సోమవారం అసెంబ్లీ వద్ద మీడియాతో ఆయన చిట్ చాట్‌గా మాట్లాడారు. 2017లో ఆయన పాదయాత్రకు వెళ్ళే సమయంలో బాధ్యతలు బుగ్గనకు గానీ ఇంకెవరికైనా అప్పగించి వెళ్ళాలి.. కానీ జగన్ అలా చేయలేదు... ఎందుకంటే ఆయన మినహా మిగతావారెవరూ మాట్లాడటం అతనికి ఇష్టం ఉండదని అన్నారు. అందుకనే జగన్ అసెంబ్లీకు రావడంలేదని... ఎవరిని రానివ్వడం లేదని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. మైక్ ఆయన ఒక్కడికే ఉండాలి... ఇంకెవరు మాట్లాడకూడదని ఆయన అనుకుంటారన్నారు. అందుకనే జగన్‌కు స్పీకర్ గంట సమయం మాట్లాడటానికి ఇస్తానంటే రేపే (మంగళవారం) అసెంబ్లీకు వస్తారన్నారు.

జగన్‌ను చూసి చాలా రోజులు అవుతుంది.. కానీ ఆయన మాత్రం అసెంబ్లీకి రావడం లేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. దీనికి పరిష్కారం ఏంటంటే.. రోజుకు జగన్‌కు గంట మాట్లాడేందుకు సమయం ఇస్తే వస్తారన్నారు. ఇంకొ విషయం ఏంటంటే.. ఆయన ఏం మాట్లాడినా అద్దం రాకూడదని.. ఇది జగన్ ఫిలాసఫీ అని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్ ఎప్పుడు సమస్యల కోసం పోరాడలేదని.. ఆయన మైక్ కోసమే మమ్ములను పోరాడమని చెప్పేవారని ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యాఖ్యానించారు.


కాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ.. అసైన్డ్ భూములు పేదల నుండి దోచేయడానికి ఎంతో ప్రయత్నం చేశారని, అసైన్డ్ భూమలు రూ. 5, రూ. 10 లక్షలకు తీసుకొని రూ. 40 , 45 లక్షలకు అమ్ముకున్నారన్నారు. పేదలు ఇవ్వనని ఎదురుతిరిగితే వారి భూములను రెడ్ మార్కులో పెట్టేశారని ఆరోపించారు.

మంత్రి అనగాని సత్య ప్రసాద్ మాట్లాడుతూ.. నిరుపయోగంగా ఉన్న భూమలును పేదలకు అసైన్డ్ చేసిందని, గత ప్రభుత్వం ఎన్నికలకు ఆరు నెలల ముందు నిషిద్ద 22 ఏ నుండి 9 లక్షలకు పైచిలుకు తొలగించాలని చూసారన్నారు. 1977 చట్టానికి సవరణ చేసి ఇప్పడు చట్టాన్ని తెచ్చారని, 20 ఏళ్లు పూర్తి అయిన అసైన్డ్ భూములకు 10 ఏళ్ళ ఇంటి స్ధలాలకు యాజమాన్య హక్కులు కల్పించారన్నారు. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ రాబందులు అక్కడికి వెళ్లి వారివద్దనుండి లాక్కున్నారని ఆరోపించారు. వారు ఇన్‌సైడ్ ట్రేడింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. దీనిలో 25 వేల రిజిష్ట్రేషన్లు జరిగితే దానిలో 8 వేల రిజిష్ట్రేషన్లు అక్రమంగా చేసినట్టు సమాచారమన్నారు. 9 లక్షలు పైచిలుకు ఎసైన్డు భూమల్లో 40 శాతం ఇలా అక్రమంగా జరిగినట్టు తెలుస్తోందన్నారు. ఎసైన్‌మెంట్ దారులను బెదిరించి లాక్కోవడంతో పాటు కొర్రీలు లేకుండా రిజిష్ట్రేషన్‌ల శాఖ నుండి ఆదేశాలు ఇప్పించుకున్నారని ఆరోపించారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామసభలు పెట్టి అభ్యంతరాలపై చర్చిస్తున్నామన్నారు. దోచుకున్న భూముల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. తప్పుచేసిన అధికారులకు కూడా ఈ వ్యవహరంలో పనిష్‌మెంట్ ఉంటుందని మంత్రి అనగాని హెచ్చరించారు. ప్రశ్నోత్తర సమయం కొనసాగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్ టార్గెట్‌గా కేటీఆర్ హస్తిన పర్యటన

విశాఖ రైల్వే డీఆర్ఎం అరెస్టును ధ్రువీకరించిన సీబీఐ

ముషాయిర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 18 , 2024 | 10:44 AM