Share News

KTR: ఉమ్మడి రాష్ట్రం నాటి నిర్బంధాలు మళ్ళీ వచ్చాయి..

ABN , Publish Date - Nov 24 , 2024 | 12:03 PM

2009 నవంబర్ 29న కేసీఆర్ దీక్షతో తెలంగాణ ఉద్యమం ములపు తిరిగిందని, శుక్రవారం (29న) 33 జిల్లా కేంద్రాల్లో దీక్ష దివస్ కార్యక్రమం నిర్వహిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే దీక్ష దివస్‌లో కేసీఆర్ పాల్గొనటం లేదని చెప్పారు. ఈనెల 26న‌ అన్ని జిల్లా కేంద్రాల్లో సన్నాహక సమావేశాలు జరుగుతాయన్నారు.

KTR: ఉమ్మడి రాష్ట్రం నాటి నిర్బంధాలు మళ్ళీ వచ్చాయి..

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President), మాజీ మంత్రి కేటీఆర్ (Ex Minister KTR) కాంగ్రెస్ ప్రభుత్వం (Conress Govt.,)పై తీవ్ర స్థాయిలో విమర్శలు (Comments) గుప్పించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన తెలంగాణ భవన్‌ (Telangana Bhavan)లో మీడియాతో మాట్లాడుతూ.. నవంబర్ 29న‌ ఘనంగా దీక్ష దివస్ నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపుచ్చారు. రేవంత్ రెడ్డి పాలనలో ఉమ్మడి రాష్ట్రం నాటి నిర్బంధాలు మళ్ళీ వచ్చాయన్నారు. కేసీఆర్ (KCR) స్పూర్తితో కాంగ్రెస్ కబంద హస్తాల నుంచి తెలంగాణ ప్రజలను కాపడుకుంటామన్నారు.

2009 నవంబర్ 29న కేసీఆర్ దీక్షతో తెలంగాణ ఉద్యమం ములపు తిరిగిందని, శుక్రవారం (29న) 33 జిల్లాల కేంద్రాల్లో దీక్ష దివస్ కార్యక్రమం నిర్వహిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే దీక్ష దివస్‌లో కేసీఆర్ పాల్గొనటం లేదని చెప్పారు. ఈనెల 26న‌ అన్ని జిల్లా కేంద్రాల్లో సన్నాహక సమావేశాలు జరుగుతాయన్నారు. తెలంగాణపై కేసీఆర్ దీక్ష చెరగని ముద్ర వేసిందని, కేసీఆర్ విమరణ రోజు డిసెంబర్ 9న మేడ్చల్‌లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ జరుగుతుందన్నారు. దీక్షకు గుర్తుగా 29న నిమ్స్‌లో రోగులకు అన్నదాన కార్యక్రమం చేస్తామన్నారు. రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీల మెడలు వంచుతామన్నారు. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ స్పూర్తితో ముందుకు వెళతామని కేటీఆర్ స్పష్టం చేశారు.


కాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి‌ది నరం లేని నాలుక అని.. ఏదైనా మాట్లాడుతుందని విమర్శించారు. అది నోరైతే నిజాలు వస్తాయి-అదే మూసీ అయితే మాయమాటలే వస్తాయని ఆక్షేపించారు. పిల్ల చేష్టలు, గారడీ మాటలు, లక్ష్యం లేని చర్యలతో రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డిపై ప్రజా వ్యతిరేక చర్యలను ఖండిస్తునే ఉంటామని హెచ్చరించారు. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్)‌లో కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేవంత్ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ కొడంగల్‌లో భూసేకరణ ఫార్మా విలేజ్‌ల కోసం అని స్పష్టంగా వెల్లడించారని అన్నారు. ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేస్తామని పలుమార్లు, పలు వేదికల మీద ప్రకటనలు చేయలేదా అని ప్రశ్నించారు. ‘మీ అన్న తిరుపతి లగచర్ల చుట్టుపక్కల గ్రామాల్లో తిరిగి ప్రైవేటు సైన్యంతో, పోలీసు బలగాలతో కలిసి భూములు ఇవ్వాలని రైతులను బెదిరించలేదా’ అని నిలదీశారు. ఎదురు తిరిగిన రైతుల మీద అక్రమ కేసులు పెట్టి, జైళ్లకు పంపి అక్రమ నిర్భంధం, అణచివేత కొనసాగించడం లేదా అని అడిగారు. ఇంత చేస్తూ ఇప్పుడు అక్కడ పెట్టేది ఫార్మా సిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ మాటమార్చి ఎవర్నీ పిచ్చోళ్లను చేస్తున్నారని ప్రశ్నించారు. చెప్పెటోడికి వినేవాడు లోకువ అన్నట్లు అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన నువ్వు అబద్ధాలతోనే కాపురం చేస్తూ కాలం వెల్లదీస్తున్నారని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సినీ నటుడు అలీకి నోటీసులు

ఆధారాలతో అడ్డంగా బుక్కైన జగన్..

హోటల్స్, లాడ్జీలు, మెన్ హాస్టళ్లపై పోలీసుల తనిఖీలు..

సోషల్ మీడియా సైకోలపై ఉక్కుపాదం

జగన్‌ను బయట ఉంచి తప్పు చేస్తున్నారు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 24 , 2024 | 12:03 PM