Home » Pressmeet
వరంగల్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారని, సెక్రటరీయేట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే కేటీఆర్‌కు ఎందుకు కోపం అని ప్రశ్నించారు. తన తండ్రిదో, చెల్లెదో విగ్రహం పెట్టాలని అనుకున్నట్టుంది..
న్యూఢిల్లీ: ఇటువంటి అసమర్థ వ్యక్తి వైఎస్ జగన్ సీఎం ఎలా అయ్యారని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. నరేంద్రమోదీ ప్రభుత్వం మంజూరు చేసిన 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టి నాలుగేళ్లు నిండాయని, ఇప్పటికీ పూర్తిగా నిర్మాణం అయ్యింది ఒక్కటి లేదని, సగం పైగా పునాదుల దశలోనే ఉన్నాయని విమర్శించారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారకరామారావు కాంగ్రెస్ నేతలపై ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలోఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు.
హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత కేసుపై హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ తీరు, సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.
కరీంనగర్ జిల్లా: తన ఫోన్‌ను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని, ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని, సీపీ ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారని.. తమ ఫోన్ ట్యాప్ చేయరని గ్యారంటీ ఏమిటని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన కరీంనగర్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..
న్యూఢిల్లీ: 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు.. వికసిత్ భారత్ థీమ్‌తో హర్ ఘర్ తిరంగా పేరుతో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు జరుగుతున్నాయని అన్నారు.
విశాఖపట్నం: హోంమంత్రి వంగలపూడి అనిత బుధవారం బెల్లం వినాయకున్ని, సంపత్ వినాయకున్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రెండు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రిని మీడియా పలుకరించగా.. కర్నూలు టీడీపీ నేత శ్రీను హత్యపై స్పందించారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నాలుగు రాజకీయ హత్యలు జరిగాయని, అందులో ముగ్గురు తెలుగుదేశం పార్టీ నేతలు హత్యకు గురయ్యారని, అనాగరికంగా హత్య చేశారని అన్నారు.
విశాఖపట్నం: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖలోని హోటల్లో సమావేశం ఏర్పాలు చేశారు. ఈ భేటీకి మాజీ మంత్రి కురసాల కన్నబాబు, వైసీపీ నేతలు కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్బంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కార్పొరేటర్లతో సమావేశం అయ్యామని 12వ తేదీన నామినేషన్ వేస్తానని చెప్పారు.
న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణ తీర్పు రాగానే దక్షణాది రాష్ట్రాలకు చెందిన నలుగురు ముఖ్యమంత్రులు అమలు చేస్తామని చెప్పారని, గతంలో నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ అమలు చేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు.
తిరుపతి: మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్దిరెడ్డి భూదందాలకు పాల్పడ్డారని, ఆయన ద్వారా భూమి కోల్పోయిన బాధితులందరూ బయటకు వచ్చి.. పెద్దిరెడ్డిపై ఫిర్యాదులు చేయాలని పిలుపిచ్చారు.