TG News: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ
ABN , Publish Date - Feb 28 , 2025 | 12:35 PM
హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి 9 పేజీల లేఖ రాశారు. ప్రభుత్వ విజ్ఞప్తులను ఆ లేఖలో ప్రస్తావించారు. ఆ లేఖలో తేదీలతో సహా ప్రస్తావించారు. తెలంగాణను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) కి 9 పేజీల లేఖ (9 Pages Letter) రాశారు. ‘తెలంగాణ రాష్ట్రానికి ప్రాజెక్టుల మంజూరులో కేంద్ర క్యాబినెట్ మంత్రిగా మీ బాధ్యతను గుర్తు చేయడం కోసం లేఖ’ అని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రాలకు ప్రాజెక్టుల మంజూరులో సీఎం రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారన్న వ్యాఖ్యలు పూర్తి బాధ్యతారాహిత్యమని, తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రిగా తెలంగాణకు కిషన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలన్నారు. తెలంగాణ అభివృద్ధికి హైదరాబాద్ మెట్రో ఫేజ్-II, ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్), మూసీ పునరుజ్జీవనం, రీజినల్ రింగ్ రైలు, డ్రైపోర్ట్ ఏపీలోని బందరు సీ పోర్టుకు గ్రీన్ ఫీల్డ్ రహదారి కీలకమని అన్నారు. వాటి నిర్మాణాలకు సంబంధించి అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వ విధివిధానాలను పూర్తిగా పాటిస్తున్నామని తెలిపారు. ఆయా ప్రాజెక్టుల సాధన కోసం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులతో పాటు మిమ్మల్ని (కిషన్ రెడ్డి) కలిసిన విషయాన్ని గుర్తు చేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఈ వార్త కూడా చదవండి..
మెట్రో ఫేజ్-1 ప్రాజెక్ట్‌ను బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది..
మెట్రో ఫేజ్ -1 69 కి.మీ. నిర్మాణాన్ని ఉమ్మడి రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మెట్రో రాకతో హైదరాబాద్ నగరంలో అభివృద్ధి పరుగులు పెట్టిందని, గత పదేళ్లలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 ప్రాజెక్ట్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, సీఎంగా తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైదరాబాద్ మెట్రో ఫేజ్-11 ప్రాజెక్టుపై పూర్తి స్థాయిలో దృష్టి సారించామని తెలిపారు. మెట్రో సేవలను విస్తరించడమే లక్ష్యంగా అయిదు కారిడార్లను ప్రతిపాదించామన్నారు. నాగోల్- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (36.8 కి.మీ.), రాయదుర్గం-కోకాపేట నియోపొలిస్ (11.6 3.2.), ఎంజీబీఎస్- చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ.), మియాపూర్-పటాన్ చెరు (13.4 కి.మీ.), ఎల్‌బీనగర్- హయత్ నగర్ (7.1 కి.మీ.). ఈ ఐదు కారిడార్ల నిర్మాణానికి రూ. 24,269 కోట్లతో ప్రతిపాదనలు ఆమోదించాలని నాటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీకి (2024, జనవరి 4వ తేదీ) వినతిపత్రం అందజేశామని చెప్పారు. 2024, అక్టోబరు ఏడో తేదీన ప్రస్తుత కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్కు ప్రతిపాదనలు అందజేశామని తెలిపారు. 2024, నవంబరు నాలుగో తేదీన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు మెట్రో ఫేజ్-II డిటైయిల్డ్ రిపోర్ట్ సమర్పించామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజాగా ఇదే అంశంపై పీఎం మోదీకి లేఖ ఇచ్చాను..
2024, డిసెంబరు 12వ తేదీన ఢిల్లీలో తాను మీతో (కిషన్ రెడ్డి) సమావేశమై హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాల లేఖను అందజేశానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు 2025, ఫిబ్రవరి 26వ తేదీన ఇదే అంశంపై లేఖ అందజేశానన్నారు. మెట్రో ఫేజ్-IIకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టాలని అన్ని లేఖల్లో స్పష్టంగా వివరించినట్లు ఆయన తెలిపారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను 2024, జులై 22న కలిసి వివరాలతో కూడిన లేఖను అందజేశామన్నారు. మీతో (కిషన్ రెడ్డి) సమావేశమైన రోజు మూసీ పునరుజ్జీవన ప్రాధాన్యాన్ని వివరించడంతో పాటు సమగ్ర వివరాలతో లేఖను అందజేశానని ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఈ నెల 21వ తేదీన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ అధికారుల బృందం మిమ్మల్ని కలిసి మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని వివరించారన్నారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మూసీ పునరుజ్జీవంపై లేఖను అందజేశానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేబినెట్..
శ్రీశైలంలో బ్రహ్మోత్సవాల పూర్ణాహుతి, త్రిశూలస్నానం..
వైఎస్సార్‌సీపీ కొత్త కుట్ర... వాట్సాప్ గ్రూపులు పెట్టించి..
ఇదేంది జగన్.. నాడు అలా.. నేడు ఇలా..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News