Bhubaneswari: ఎన్టీఆర్ ట్రస్ట్ లక్ష్యం అదే..: నారా భువనేశ్వరి
ABN , Publish Date - Mar 06 , 2025 | 11:01 AM
విజయవాడలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు భవన్ నిర్మానానికి గురువారం ఉదయం శంఖుస్థాసన చేశామని ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. సమాజానికి ఏది అవసరమో, సేవభావంతో అది చేసేందుకు ఎన్టీఆర్ ట్రస్టు ఎప్పుడూ ముందు ఉంటుందని, ప్రజలకు ఏదైతే చెప్పామో అది చేసి చూపటమే ఎన్టీఆర్ ట్రస్ట్ లక్ష్యమని భువనేశ్వరి స్పష్టం చేశారు.

అమరావతి: విజయవాడ (Vijayawada)లో ఎన్టీఆర్ ట్రస్టు భవన్ (NTR Trust Bhavan) నిర్మాణానికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ (NTR Memorial Trust Managing Trustee) నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) గురువారం ఉదయం శంఖుస్థాపన చేశారు. స్థానిక సాయిబాబా మందిరం 9Sai Baba Temple)లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శంకుస్థాపన (Foundation stone laying) కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు. విజయవాడ టీచర్స్ కాలనీలోని సాయిబాబా గుడి వీధిలో 600 గజాల స్థలంలో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పాల్గొన్నారు.
Read More News..:
పోసాని కి బెయిల్ వచ్చేనా.. ఎందుకంటే..
ఎప్పుడు తలుపులు తట్టినా అందుబాటులో..
ఈ సందర్భంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. ఐదంతస్థుల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందని.. సమాజానికి ఏది అవసరమో, సేవభావంతో అది చేసేందుకు ఎన్టీఆర్ ట్రస్టు ఎప్పుడూ ముందు ఉంటుందని తెలిపారు. ప్రజలకు ఏదైతే చెప్పామో అది చేసి చూపటమే ఎన్టీఆర్ ట్రస్ట్ లక్ష్యమని పేర్కొన్నారు. రక్తదానంతో పాటు తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులను ఆదుకునే లక్ష్యంతో ఇక్కడ సేవలు అందిస్తామని భువనేశ్వరి స్పష్టం చేశారు. అత్యవసర వైద్య సేవకు ట్రస్టు తలుపులు ఎప్పుడు కొట్టినా 24 గంటలూ అందుబాటులో ఉంటామన్నారు.
25 ఏళ్లుగా నిరంతర సేవలు..
ఫిబ్రవరి 2026లో విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు అందుబాటులోకి వస్తాయని నారా భువనేశ్వరి చెప్పారు. విద్య, వైద్య సేవా కార్యక్రమాలు రాష్ట్రంలో మరింత విస్తృతం చేసే లక్ష్యంతో భవన నిర్మాణం చేపడతామన్నారు. సమాజానికి తిరిగి ఇవ్వాలని దాతృత్వం చాటుకునే వారు తమతో చేతులు కలపాలని కోరుతున్నామన్నారు. 25 ఏళ్లుగా నిరంతర సేవలు అందిస్తున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా హైదరాబాద్‌లో ప్రారంభమైన ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు వివిధ ప్రాంతాలకు విస్తరిస్తున్నామన్నారు. నైపుణ్యం శిక్షణ ద్వారా మహిళలు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. నిరుపేద విద్యార్థులు ఎందరికో ఉచిత విద్య ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందిస్తున్నామని, ఎప్పుడు ఎక్కడ విపత్తులు వచ్చినా సేవలు అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటోందని పేర్కొన్నారు. న్యూట్రిఫుల్ యాప్ ద్వారా డైట్ వివరాలు అందిస్తున్నామని, రక్తదానాన్ని ప్రతీ ఒక్కరూ అలవాటుగా మార్చుకోవాలని కోరుతున్నానని నారా భువనేశ్వరి అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
యాదగిరిగుట్ట 6వ రోజు బ్రహ్మోత్సవాలు..
ఏపీలో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News