Share News

Minister Atchannaidu: ఆ హోదా స్పీకర్, చంద్రబాబు ఇచ్చేది కాదు.. ఎవరు ఇస్తారంటే..: అచ్చెన్న

ABN , Publish Date - Feb 24 , 2025 | 02:03 PM

అసెంబ్లీ కి అన్నిపార్టీలు. వచ్చాయని, వైసీపీ నేతలు నల్ల కండువాలు వేసుకుని వచ్చారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అధిక స్థానాలు వున్న వారికి అధికార పక్షం రెండవ స్థానం వచ్చిన వారికి ప్రతిపక్షం ఇస్తారని, మరి వైసీపీలో 11 మంది గెలిచి ప్రతిపక్ష హోదా కావాలి అంటున్నారని.. జగన్ వింత పోకడలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు.

Minister Atchannaidu: ఆ హోదా స్పీకర్, చంద్రబాబు ఇచ్చేది కాదు.. ఎవరు ఇస్తారంటే..: అచ్చెన్న
Minister Atchannaidu comments

అమరావతి: వైఎస్సార్‌సీపీ (YSRCP)పై మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) తీవ్రస్థాయిలో మండిపడ్దారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Budget Meetings) వాయిదా పడిన అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ (Assembly Media Point) వద్ద మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వంలో వుండగా చెప్పిన అబద్ధాన్ని పదే పదే చెపుతోందని, ఈ రోజు శాసన సభకు వచ్చారని, ప్రజాసమస్యలపై మాట్లాడతారరని అనుకున్నానని.. అయితే అక్కడ కూడా స్వార్థం చూపించారని అన్నారు. ప్రతిపక్ష హోద ఇస్తే తప్ప శాసనసభకు రామని చెప్పిన ఆ పార్టీ ఆసలు రాజకీయ పార్టీయేనా అని ప్రశ్నించారు.

ఈ వార్త కూడా చదవండి..

ఏపీలో మెట్రోపై గవర్నర్ కీలక ప్రకటన


జగన్ వింత పోకడలు చూస్తుంటే..

అసెంబ్లీ కి అన్నిపార్టీలు. వచ్చాయని, వైసీపీ నేతలు నల్ల కండువాలు వేసుకుని వచ్చారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అధిక స్థానాలు వున్న వారికి అధికారపక్షం, రెండవ స్థానం వచ్చిన వారికి ప్రతిపక్షం ఇస్తారని, మరి వైసీపీలో 11 మంది గెలిచి ప్రతిపక్ష హోదా కావాలి అంటున్నారని.. ప్రతిపక్ష హోదా స్పీకర్, చంద్రబాబు ఇచ్చేది కాదని ప్రజలు ఇవ్వాలని అన్నారు. జగన్ వింత పోకడలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. ఢిల్లీలో ఎన్నికలు అయ్యాయి.. మొన్నటి వరకు కేజ్రీవాల్ ముఖ్యమంత్రి.. ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయారు.. శాసనసభ్యుడిగా వెళ్లగలరా అని ప్రశ్నించారు.

అందుకే మండలిలో వైసీపీకి ప్రతిపక్ష హోదా..

ప్రెస్ మీట్ పెట్టిన బొత్స సత్యనారాయణకు మండలిలో బలం వుందని అందుకే ప్రతిపక్ష హోదా ఇచ్చామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ప్రజలు వైసీపీ పార్టీని అసహ్యించు కుంటున్నారని, 4 రోజులు పోతే సిఎం పదవి ఇస్తే తప్ప సభకు రానంటా రెమోనని అన్నారు. ప్రతిపక్షంగా సభకు వచ్చి అడిగితే స్పష్టంగా సమాధానం చెపుతామన్నారు. మార్కెట్‌లో 12 వేల రూపాయలు మిర్చి ధర ఉంటే రూ. 7వేల ధర ఎవరైనా నిర్ణయిస్తారా అని ప్రశ్నించారు.


అటెండెంటో కోసమే..

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కార్యక్రమాలను గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారని, ఒక రాజకీయపార్టీ కేవలం అటెండెన్స్ కోసమే అసెంబ్లీకి వచ్చిందని, 60 రోజుల పాటు సభకు రాక పోతే సభ్యత్వం కోల్పోతామన్న భయంతోనే సంతకాలు చేసి వెళ్ళిపోయారని మంత్రి అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. ఏ పార్టీ అయినా రాజ్యాంగానికి లోబడి ప్రవర్తించాలన్నారు. అవినీతి అక్రమాలతో పుట్టిన ఆ పార్టీకి అసత్యాలు చెప్పటం ఆలవాటు అయిపోయిందని అచ్చెన్నాయుడు అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తల్లికి వందనం పథకం: గవర్నర్‌

రైతులకు గవర్నర్ శుభవార్త...

వల్లభనేని వంశీపై సీఐడి పిటి వారెంట్ జారీ

ఐదు నిముషాల్లోనే సభ నుంచి వెళ్లిపోయిన జగన్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 24 , 2025 | 02:03 PM