Home » Priyanka Gandhi
కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. అలాగే లోక్సభ ఎన్నికల్లో సైతం కేంద్రంలో అధికారాన్ని అందుకోవాలని ఆ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది.
ఆసోం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వాస్ శర్మ (Himanta Biswa Sarma)అత్యంత అవినీతిపరుడైన నాయకుడని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priaynka Gandhi) అభివర్ణించారు. ఆయన పాలనలో మాఫియా రాజ్యం నడుస్తుందని ఆరోపించారు.
మేథీ, రాయబరేలి లోక్సభ స్థానాల నుంచి బరిలో దిగే అభ్యర్థులపై కొన్ని గంటల్లో నిర్ణయిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ మీడియా సెల్ చీఫ్ జై రాం రమేశ్ బుధవారం వెల్లడించారు. ఆ యా నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కసరత్తు చేస్తున్నారన్నారు. 24 గంటల్లో లేదా 30 గంటల్లో ఆ రెండు నియోజకవర్గాల అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు.
కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఉత్తరప్రదేశ్లోని అమేథీ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా సోమవారంనాడు నామినేషన్ వేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆమె వెంట నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.
యూపీలోని రాయబరేలి లోక్సభ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇందుకోసం సర్వశక్తులు ఒడ్డనుంది. ప్రియాంక గాంధీ వాద్రాను రాయబరేలి నుంచి తొలిసారి ఎన్నికల బరిలోకి దింపేందుకు ముందస్తుగా పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఎలక్షన్ మేనేజిమెంట్ కోసం 'స్పెషల్ 24' టీమ్ను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ ఏర్పాటు చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన ప్రధానులతో పాటు ఎందరో ప్రధానులను తాను చూశానని, కానీ బహిరంగంగా పచ్చి అబద్ధాలు చెప్పే ప్రధానిని చూడటం మాత్రం ఇదే మొదటిసారని అన్నారు.
ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కు మొదట్నించీ పట్టు ఉన్న అమేథి , రాయబరేలి నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎవరిని తమ అభ్యర్థులుగా బరిలోకి దింపనుందనే సస్పెన్స్కు మరి కొద్ది గంటల్లోనే తెరపడనుంది. అమేథీ, రాయబరేలికి చెందిన పార్టీ విభాగం నేతలతో కేంద్ర నాయకత్వం శనివారం సాయంత్రం ఢిల్లీలో సమావేశమవుతోంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమై అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనుంది.
బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీకి ఆ పార్టీ నాయకత్వం రాయ్ బరేలీ టికెట్ ఆఫర్ చేయగా ఆయన తిరస్కరించినట్టు సమాచారం.
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దేశంలోనే అత్యధిక లోక్సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్లో బీజేపీని నియంత్రించేందుకు ప్రయత్నిస్తోంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ సీనియర్ నేతలపై కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా రావనే నిరాశానిస్పృహలు బీజేపీలో కనిపిస్తున్నాయన్నారు. ఆ కారణంగానే ప్రజా సంక్షేమంతో ఏమాత్రం సంబంధంలేని రోజుకో అంశాన్ని ఆ పార్టీ నేతలు లేవనెత్తుతున్నారని ప్రియాంక తప్పుపట్టారు.