Share News

Lok Sabha Results: యూపీ ప్రజలకు ప్రియాంక ధన్యవాదాలు

ABN , Publish Date - Jun 07 , 2024 | 04:19 AM

ఇండియా కూటమికి అద్భుతమైన ఫలితాలను అందించిన యూపీ ప్రజలకు కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ ధన్యవాదాలు తెలిపారు. యూపీ వాసులు దేశ ప్రజలకు ధృడమైన సందేశం ఇచ్చారని, రాజ్యాంగ రక్షణకు వారు చూపిన తెగువ అద్భుతమైనదని గురువారం ఎక్స్‌ వేదికగా కొనియాడారు.

Lok Sabha Results: యూపీ ప్రజలకు ప్రియాంక ధన్యవాదాలు

ఇండియా కూటమికి అద్భుతమైన ఫలితాలను అందించిన యూపీ ప్రజలకు కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ ధన్యవాదాలు తెలిపారు. యూపీ వాసులు దేశ ప్రజలకు ధృడమైన సందేశం ఇచ్చారని, రాజ్యాంగ రక్షణకు వారు చూపిన తెగువ అద్భుతమైనదని గురువారం ఎక్స్‌ వేదికగా కొనియాడారు. ప్రజాస్వామ్యంలో దేశ సమస్యలు తప్ప ఇంకేవీ ప్రధానమైనవి కాదనే విషయాన్ని వారు చాటి చెప్పారని అభినందించారు. అలాగే కూటమి అద్భుత ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Jun 07 , 2024 | 07:07 AM