LokSabha Election Result: రేపు రాయ్‌బరేలీకి రాహుల్, ప్రియాంక..?
ABN , Publish Date - Jun 10 , 2024 | 04:21 PM
ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 స్థానాల్లో విజయం సాధించింది. ఇక మహారాష్ట్రలోని సంగ్లి నుంచి గెలుపొందిన విశాల్ పాటిల్.. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖర్జున్ ఖర్గే సమక్షంలో తీర్థం పుచ్చుకున్నారు.
అమేఠీ, జూన్ 10: ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 స్థానాల్లో విజయం సాధించింది. ఇక మహారాష్ట్రలోని సంగ్లి నుంచి గెలుపొందిన విశాల్ పాటిల్.. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖర్జున్ ఖర్గే సమక్షంలో తీర్థం పుచ్చుకున్నారు. దీంతో లోక్‌సభలో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 100కి చేరింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా దక్కింది. ఈ నేపథ్యంలో సభలో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాలంటూ.. ఆ పార్టీలో డిమాండ్ రోజు రోజుకు తీవ్రమవుతుంది.
Also Read: Modi 3.0: 18 నుంచి పార్లమెంట్ సమావేశాలు..!
ఇక ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ తొలుత కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా రెండోసారి బరిలో నిలిచారు. అనంతరం రాయ్‌బరేలి నుంచి సైతం ఆయన పోటీ చేశారు. ఈ రెండు స్థానాల్లో రాహుల్ భారీ అధిక్యంతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో రాయ్‌బరేలీ ఓటర్లకు గాంధీ కుటుంబం కృతజ్ఞతలు తెలపాలని నిర్ణయించింది. అందుకోసం జూన్ 11వ తేదీ.. అంటే మంగళవారం రాయబరేలీలోని భూమౌ అతిథిగృహంలో ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీతోపాటు ప్రియాంక గాంధీ నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలియ జేయనున్నారు. ఈ కార్య్రక్రమంలో అమేఠీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కె.ఎల్. శర్మ సైతం పాల్గొనున్నారు. ఈ మేరకు అమేఠీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రదీప్ సింఘాలు వెల్లడించారు. అయితే ఈ కృతజ్ఞతలు.. మొదట అమేఠీ ప్రజలకు చెప్పాలని రాహుల్, ప్రియాంక గాంధీలు భావించారని... కానీ ఆ తర్వాత ఈ కార్యక్రమం రాయ్‌బరేలీకి మారిందని ప్రదీప్ వివరించారు.
Also Read: Election Commission: మళ్లీ మోగిన నగారా.. జులై 10న ఎన్నికలు
ఇక రాయ్‌బరేలీ గాంధీ కుటుంబానికి కంచుకోటనన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే గత రెండు దశాబ్దాలుగా ఈ నియోజకవర్గం నుంచి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె ఇటీవల రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో రాహుల్‌కి ప్రత్యర్థిగా యోగి కేబినెట్‌లోని దినేశ్ ప్రతాప్ సింగ్ బరిలో నిలిచారు. అయితే రాయ్‌బరేలీ ఓటర్లు మాత్రం.. రాహుల్ గాంధీకే పట్టం కట్టారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ఓటర్లకు గాంధీ కుటుంబం కృతజ్ఞతలు తెలిపాలని నిర్ణయించింది.
Also Read: Modi 3.0: ఇంతకీ లోక్‌సభ స్పీకర్ ఎవరు?
ఇంకోవైపు అమేఠీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కె.ఎల్. శర్మను గాంధీ కుటుంబం బరిలోకి దింపింది. ఆయన తన ప్రత్యర్థి బీజేపీ నాయకురాలు స్మృతీ ఇరానీపై గెలుపొందారు. అమేఠీ సైతం గాంధీ కుటుంబానికి మరో కంచుకోట అన్న విషయం విధితమే. గత ఎన్నికల్లో అంటే.. 2019లో స్మృతీ ఇరానీ చేతిలో రాహుల్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
Read More National News and Latest Telugu News