Home » Protest
ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని ఆమాద్మీ పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆప్ నేతలు గోపాల్ రాయ్, సౌరభ్ భరద్వాజ్, సందీప్ పాఠక్, అతిషి మర్లీనా వెల్లడించారు.
ఈరోజు రైల్ రోకో ఉద్యమానికి రైతులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పంజాబ్-హర్యానా రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రైతులు రైలు పట్టాలపై కూర్చొని నిరసనలు తెలుపనున్నారు. దాదాపు నాలుగు గంటలపాటు ఈ నిరసన చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో పలు ట్రైన్స్ రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది.
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం జరుగుతోందని జీవో 3 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఇందిరా పార్క్ వద్ద భారత్ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో భారత్ జాగృతి శ్రేణులు పాల్గొన్నారు.
విశాఖ: ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం మహా పాదయాత్ర ప్రారంభమైంది. కూర్మన్నపాలెం దీక్షా శిబిరం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర సాగనుంది. ఈ పాదయాత్రలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు, అఖిలపక్షం కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైల్వే యూనియన్ సంఘాల నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే మే 1 నుంచి
తమ సమస్యలను పరిష్కరించాలంటూ దేశ రాజధాని సరిహద్దులో శాంతియుతంగా నిరసనలు చేస్తున్న రైతులకు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దిల్లీలోకి రాకుండా వారిని నిలువరించేందుకు బారికేడ్లు, కంచెలు నిర్మించారు.
ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత తగ్గింది. 12 రోజుల తర్వాత సింగు, తిక్రీ సరిహద్దులు మళ్లీ తెరవబడ్డాయి. దీంతో ట్రాఫిక్ జామ్ సమస్య తగ్గింది.
నెల్లూరు: భగత్ సింగ్ కాలనీలోని టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు యువత ఆందోళనకు దిగింది. ఈ సందర్బంగా టీడీపీ శ్రేణులు నగరంలో భారీ బైకు ర్యాలీలు నిర్వహించారు.
యునైటెడ్ కిసాన్ మోర్చా 'ఢిల్లీ చలో(Delhi Chalo)' మార్చ్‌ను ఫిబ్రవరి 29కి వాయిదా వేసింది. ఫిబ్రవరి 29న ఉద్యమంపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని రైతు సంఘం నాయకుడు సర్బన్ సింగ్ పంధేర్ తెలిపారు.
Subsidy on Potash: ఓవైపు డిమాండ్ల సాధన కోసం దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు(Farmers) పోరాటం సాగిస్తుండగా.. మరోవైపు రైతులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం(Union Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రైతులకు ఎంతో మేలు జరుగనుంది.