TG News: AEE అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలి: ఎమ్మెల్యే హరీశ్ రావు
ABN , Publish Date - Jun 11 , 2024 | 06:15 PM
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(AEE) పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడో పూర్తయినా తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థులకు ఇంతవరకూ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వకపోవడం బాధాకరమని ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు(MLA Harish Rao) అన్నారు. గాంధీ భవన్ వద్ద మోకాళ్లపై నిరసన తెలుపుతున్న AEE అభ్యర్థులకు ఎక్స్(ట్విటర్) వేదికగా ఆయన సంఘీభావం తెలిపారు.
హైదరాబాద్: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(AEE) పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడో పూర్తయినా తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థులకు ఇంతవరకూ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వకపోవడం బాధాకరమని ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు(MLA Harish Rao) అన్నారు. గాంధీ భవన్ వద్ద మోకాళ్లపై నిరసన తెలుపుతున్న AEE అభ్యర్థులకు ఎక్స్(ట్విటర్) వేదికగా ఆయన సంఘీభావం తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం AEE పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి వివిధ దశల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేసిందని గుర్తు చేశారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి నెలలోనే అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసినా.. ఇప్పటికీ నియామక పత్రాలు ఇవ్వకపోవడంపై ఆయన మండిపడ్డారు. రాష్ట్ర మంత్రులు, అధికారులకు అభ్యర్థులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా స్పందించి AEE పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు అందజేయాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు
TG News: జూన్ 12న ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం: మంత్రి పొంగులేటి