Share News

TDP: ఎస్పీకి, ఆయన ఫ్యామిలీకి మేమే రక్షణ కల్పిస్తాం: సుధారెడ్డి

ABN , Publish Date - May 15 , 2024 | 12:10 PM

తిరుపతి: పోలింగ్‌ ముగిసిన తర్వాత కూడా వైసీపీ మూకల దాడులు కొనసాగుతునే ఉన్నాయి. మంగళవారం చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీపై హత్యాయత్నానికి పాల్పడ్డాయి. తిరుపతిలోని పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయ ఆవరణలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ను సందర్శించి తిరిగి వెళ్తున్న సమయంలో వైసీపీ వర్గీయులు ఆయనపై దాడి చేశారు. సుమారు 150 మంది మారణాయుధాలతో దాడి చేయగా నానీ భుజానికి గాయమైంది.

TDP: ఎస్పీకి, ఆయన ఫ్యామిలీకి మేమే రక్షణ కల్పిస్తాం: సుధారెడ్డి

తిరుపతి: పోలింగ్‌ (Polling) ముగిసిన తర్వాత కూడా వైసీపీ(YCP) మూకల దాడులు కొనసాగుతునే ఉన్నాయి. మంగళవారం చంద్రగిరి టీడీపీ అభ్యర్థి (TDP Candidate) పులివర్తి నానీ (Pulivarti Nani)పై హత్యాయత్నానికి (Murder attempted) పాల్పడ్డాయి. తిరుపతి (Tirupati)లోని పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయ ఆవరణలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ను (Strong room) సందర్శించి తిరిగి వెళ్తున్న సమయంలో వైసీపీ వర్గీయులు ఆయనపై దాడి చేశారు. సుమారు 150 మంది మారణాయుధాలతో దాడి చేయగా నానీ భుజానికి గాయమైంది. దీనిపై పులివర్తి నానీ వర్గీయులు పోలీసులు ఫిర్యాదు చేయగా దాడులు చేసిన వారిని అరెస్టు చేయకుండా టీడీపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో తిరుచానూరు పోలీస్ స్టేషన్ దగ్గర నానీ భార్య సుధారెడ్డి (Sudhareddy), టీడీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని, టీడీపీ కార్యకర్తలను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.


ఈ సందర్భంగా పులివర్తి నానీ సతీమణి సుధారెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లడుతూ..నిన్న (మంగళవారం) 3 గంటల ప్రాంతంలో నానీపై హత్యాయత్నం జరిగిందని గన్ మెన్ (Gunmen)కాపాడారని, లేకపోతే నానీ ఉండేవారుకాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి అన్ని ఆధారాలు ఇచ్చామని.. దీంతో దాడి చేసిన వారిని గంటలో అరెస్టు చేస్తామని ఎస్పీ చెప్పారని ఇంత వరకు అరెస్టు చేయలేదని అన్నారు. పైగా ముందస్తు చర్యగా తమవాళ్లను స్టేషన్లో పెట్టారని మండిపడ్డారు. ఎస్పీకి భయంగా ఉందంటా.. జూన్ 4వ తేదీ వరకు ఏమీ చేయలేమని ఆయన చెబుతున్నారని.. అంతవరకు మేము ఓపిగ్గా ఉండాలని ఏస్పీ చెబుతున్నారని సుధారెడ్డి తెలిపారు. అయితే 4వ తేదీ వరకు ఎస్పీకి, ఆయన కుటుంబానికి తామే రక్షణ కల్పిస్తామని ఆమె అన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా మాట్లాడితే తామేంచేయాలని సుధారెడ్డి ప్రశ్నించారు.


కాగా పోలింగ్‌ ముగిసిన తర్వాత కూడా వైసీపీ మూకల దాడులు కొనసాగుతునే ఉన్నాయి. మంగళవారం చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీపై హత్యాయత్నానికి పాల్పడ్డాయి. తిరుపతిలోని పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయ ఆవరణలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ను సందర్శించి తిరిగి వెళ్తున్న సమయంలో వైసీపీ వర్గీయులు ఆయనపై దాడి చేశారు. సుమారు 150 మంది మారణాయుధాలతో దాడి చేయగా నానీ భుజానికి గాయమైంది. గాల్లోకి కాల్పులు జరిపి వైసీపీ శ్రేణులను అడ్డుకునేందుకు యత్నించిన గన్‌మన్‌ తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి నగరంతో పాటు చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. మంగళవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో పులివర్తి నానీ రెండు వాహనాల్లో మహిళా విశ్వవిద్యాలయంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూముల వద్దకు వచ్చారు. తిరిగి వెళ్తుండగా అప్పటికే అక్కడ మాటేసిన రామచంద్రాపురం మండలం రామాపురం వైసీపీ ఎంపీటీసీ భాను, అతని అనుచరులు 150 మంది రాళ్లు, ఇనుప రాడ్లు, సుత్తులు, కర్రలతో నానీ వాహనాలపై దాడిచేసి ధ్వంసం చేశారు. ఈ దాడిలో నానీ భుజానికి గాయాలయ్యాయి.


వారిని అడ్డుకునేందుకు నానీ గన్‌మన్‌ ధరణి గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా వైసీపీ వర్గీయులు దాడికి తెగబడటంతో ధరణి తలకు, కంటి వద్ద తీవ్ర గాయాలయ్యాయి. స్ట్రాంగ్‌రూమ్‌ వద్ద కాపలా ఉన్న పోలీసు బలగాలు అక్కడకు చేరుకోవడంతో వైసీపీ వర్గీయులు పరారయ్యారు. స్ట్రాంగ్‌ రూమ్‌ వద్దే ఉన్న నానీ భార్య సుధారెడ్డి దాడి గురించి పోలీసులకు, టీడీపీ శ్రేణులకు సమాచారమిచ్చారు. దీంతో భారీఎత్తున టీడీపీ మద్దతుదారులు వర్సిటీ ప్రాంగణానికి చేరుకుని ప్రతిదాడికి దిగారు. ఈ దాడిలో వైసీపీ వర్గీయులు వదిలిపెట్టిన కారుతోపాటు అలిపిరి సీఐ రామచంద్రారెడ్డి వాహనం సైతం ధ్వంసమైంది. ఆవరణ వెలుపల ఓ మోటర్‌ బైక్‌ను కూడా తగులబెట్టారు. సొమ్మసిల్లి పడిపోయిన నానీని వర్సిటీ మెయిన్‌ గేటు వెలుపల రోడ్డుపై పడుకోబెట్టి టీడీపీ శ్రేణులు బైఠాయించారు. పోలీసు వైఫల్యంతోనే దాడి జరిగిందంటూ విరుచుకుపడ్డారు. వర్సిటీ వెనుకవైపు ప్రహరీని ఆనుకునే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్వగ్రామమైన తుమ్మలగుంట ఉంది. తీవ్ర ఆగ్రహంతో ఉన్న టీడీపీ శ్రేణులు దాడులకు దిగుతారేమోనని వైసీపీ వర్గీయులు భారీగా తుమ్మలగుంట కూడలి, గాంధీపురం ప్రాంతాల్లో కర్రలు, రాళ్లతో మోహరించారు. టీడీపీ వర్గీయులను చెదరగొట్టేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో బీఎ్‌సఎఫ్‌ జవాన్లు రబ్బర్‌ బుల్లెట్లతో గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా వెనక్కి తగ్గకపోవడంతో కేంద్ర బలగాలను, టియర్‌ గ్యాస్‌ వాహనాలను రప్పించారు. కేంద్ర బలగాలు లాఠీచార్జి జరిపి ఆందోళన చేపట్టిన టీడీపీ వర్గీయులను చెదరగొట్టారు. లాఠీచార్జిలో ఐదుగురు టీడీపీ కార్యకర్తలతో పాటు ఐదుగురు మీడియా ప్రతినిధులు గాయపడ్డారు. గాయపడిన నానీని స్విమ్స్‌ ఆస్పత్రికి తరలించగా గన్‌మన్‌ ధరణి రుయాలో చికిత్స పొందుతున్నారు. ఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి, గాయపడిన నానీ, గన్‌మన్‌ ధరణితో మాట్లాడారు.


నానీ క్షేమం... స్ట్రాంగ్‌ రూమ్‌ భద్రం: ఎస్పీ

ప్రత్యర్థుల దాడిలో గాయపడిన నానీ క్షేమంగా ఉన్నారని ఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌ స్పష్టం చేశారు. వర్సిటీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. నానీని, గన్‌మన్‌ను స్వయంగా కలసి మాట్లాడి వివరాలు తెలుసుకున్నానని, వారి పరిస్థితి బాగుందని, ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. వర్సిటీ ఆవరణలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌లు కూడా భద్రంగా ఉన్నాయని తెలిపారు. పులివర్తి నానీపై దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించామని, వారిని అరెస్టు చేసి రిమాండుకు తరలిస్తామన్నారు. సీసీ ఫుటేజీ ఆధారాలున్నాయని ఎస్పీ చెప్పారు.


పోలీసు వైఫల్యంతోనే దాడి

వర్సిటీ ఆవరణలోని ఇంజనీరింగ్‌ విభాగం గదుల్లో ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. అక్కడ మూడంచెల భద్రత కల్పించామని కలెక్టర్‌, ఎస్పీ వెల్లడించారు. అయితే ఎన్నికల అధికారులను, అభ్యర్థులను వారి ఐడీలు తనిఖీ చేశాకే లోనికి అనుమతించాల్సి ఉండగా 150మందికి పైగా వైసీపీ కార్యకర్తలు వాహనాల్లో వర్సిటీ ఆవరణలోకి ఎలా రాగలిగారన్నది ప్రశ్న. అంతమంది యథేచ్ఛగా మారణాయుధాలతో లోనికి వచ్చి టీడీపీ అభ్యర్థి వాహనాలను ధ్వంసం చేసి దాడి చేయడం కలకలం సృష్టించింది. స్ట్రాంగ్‌ రూములున్న వర్సిటీ ఆవరణలో భద్రత డొల్లతనాన్ని ఈ ఘటన బట్టబయలు చేసింది. ఘటన జరిగిందని తెలిసిన తర్వాత కూడా తగిన సంఖ్యలో పోలీసు బలగాలు సకాలంలో చేరుకోకపోవడంతో ఐదారువందల మంది టీడీపీ మద్దతుదారులు ప్రతిదాడులకు పాల్పడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తాడిపత్రిలో కొనసాగుతున్న ఉద్రిక్తత..

అవి కారు పార్టీ అభ్యర్థికి నష్టం కలిగించాయా?

ప్యాకప్ కట్టేసిన ఐప్యాక్ ప్రతినిధులు?

జగన్ ప్రభుత్వం రూ. 4 వేల కోట్లు అప్పు..

ఏలూరులో టీడీపీ వర్గీయులపై వైసీపీ నాయకుల దాడి

కవిత కస్టడీ 20 వరకు పొడిగింపు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 15 , 2024 | 12:39 PM