Home » Purandeswari
విజయవాడ: రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆధ్వర్యంలో పలువురు కృష్ణా జిల్లా నేతలు, కార్యకర్తలు పార్టీలో చేరారు. వారికి ఆమె బీజేపీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
BJP First MP Candidates List: హ్యాట్రిక్ కొట్టాల్సిందేనని.. బీజేపీ (BJP) పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. కాంగ్రెస్ తమతో కలిసొచ్చే పార్టీలను కలుపుకోని పోయే పనిలో ఉంటే.. బీజేపీ మాత్రం అందరి కంటే ముందుగానే కూటమి ఏర్పాటు చేసేయడం.. అభ్యర్థులను కూడా ప్రకటించేసే పనిలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మోదీ మూడోసారి ప్రధాని కావాల్సిందేనని బీజేపీ పెద్దలు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. చిన్నపాటి అవకాశం వచ్చినా సరే.. సువర్ణావకాశంగా మలుచుకుని ముందుకెళ్తున్నారు..
విజయవాడ: టిడ్కో ఇళ్ళు కూడా ఇవ్వలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని.. గత ప్రభుత్వం, ప్రస్తుత సర్కార్ ఒక్కో లబ్దిదారుల దగ్గర నుంచి 25 వేల నుంచి లక్ష రూపాయలు వసూలు చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు.
Andhrapradesh: ఎన్నికల కోసం సన్నాహం.. కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో శ్రీకారం చుట్టామని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి అన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల సన్నహాల నేపథ్యంలో భారత్ రైజింగ్ అలైట్ మీట్ పేరుతో బీజేపీ సమావేశాలు నిర్వహిస్తోంది. జిల్లాలో జరిగిన సమావేశంలో పురందేశ్వరి మాట్లాడుతూ.. బీజేపీ రాజకీయ పార్టీ ఇతర రాజకీయ పార్టీల కన్నా భిన్నమన్నారు. అధికారాన్ని సేవ భావం కోసం వినియోగిస్తున్నామన్నారు.
విజయవాడ: తెలుగుదేశం, జనసేన పార్టీల పొత్తులపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలలో ‘మా వ్యూహం మాకుంది’ అని అన్నారు. బూత్ లెవల్ నుంచి పార్టీ బలోపేతం పని చేస్తున్నామన్నారు.
విజయవాడ: ప్రవాస భారతీయుడు, గొలగాని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొలగాని రవికృష్ణ బీజేపీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రవికృష్ణకు కాషాయం కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందని సమాచారం. పొత్తులు, సీట్ల సర్దుబాటు పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంకోసారి పొత్తులపై మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని విష్ణువర్ధన్ రెడ్డిని అధిష్టానం హెచ్చరించిందట. విష్ణు వర్ధన్ రెడ్డితో పాటు పలువురు ఏపీ నేతలపై బీజేపీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారని టాక్. బీజేపీ నుంచే సీఎం అభ్యర్థి అని విష్ణువర్ధన్ రెడ్డి చేసిన ప్రకటనపై జాతీయ నేతలకు ఫిర్యాదులు అందాయి.
ముఖ్య మంత్రి జగన్ రెడ్డి అనంతపురం ‘‘సిద్ధం’’ సభలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి ప్రత్యక్ష ఉదాహరణ అని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandeswari ) అన్నారు.
ఏపీలో పొత్తులపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Purandeshwari) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం నాడు ఢిల్లీ వేదికగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... పొత్తులపై బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. ఆదివారం విజయవాడలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్దంతి సందర్బంగా ఆమె పుష్పగుచ్చములుంచి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర పరిస్థితులను బట్టి బీజేపీ అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు.