Purandeswari: టిడ్కో ఇళ్ళు కూడా ఇవ్వలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం..
ABN , Publish Date - Feb 29 , 2024 | 01:00 PM
విజయవాడ: టిడ్కో ఇళ్ళు కూడా ఇవ్వలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని.. గత ప్రభుత్వం, ప్రస్తుత సర్కార్ ఒక్కో లబ్దిదారుల దగ్గర నుంచి 25 వేల నుంచి లక్ష రూపాయలు వసూలు చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు.
విజయవాడ: టిడ్కో ఇళ్ళు (Tidco Houses) కూడా ఇవ్వలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం (Jagan (Govt) ఉందని.. గత ప్రభుత్వం, ప్రస్తుత సర్కార్ ఒక్కో లబ్దిదారుల దగ్గర నుంచి 25 వేల నుంచి లక్ష రూపాయలు వసూలు చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeshwari) విమర్శించారు. గురువారం విజయవాడలోని బీజేపీ (BJP) కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధిలు, మీడియా ప్యానలిస్ట్‌లు, జిల్లా మీడియా ప్యానలిస్ట్‌లకు జరుగుతున్న రాష్ట్ర స్థాయి వర్క్ షాప్‌లో ముఖ్య అతిథిగా హాజరైన పురందేశ్వరి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తోందని, ఓట్లు కోసమే సంక్షేమం పధకాలు అంటున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ఓట్లు చూడలేదని, పేదవారికి ప్రతి పథకం అందాలని ఆలోచన చేస్తుందని పురందేశ్వరి అన్నారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పాత్రను బీజేపీ పోషించిందని, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం చెస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేయలేక పోయాయన్నారు. అనేక అంశాలపై బీజేపీ ప్రభుత్వం మీద పోరాటం చేసిందని, ఉప ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తెలుకునేలా బీజేపీ పోరాటం చేసిందన్నారు. పార్టీ అధికార ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు మనం చేసిన పోరాటాలపై మాట్లాడాలన్నారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన మేలు గురించి ప్రసార మాధ్యమాల్లో గట్టిగా చెప్పాలని సూచించారు. ఎన్నికలకు ఇంకా 45, 50 రోజుల సమయం మాత్రమే ఉందని పురందేశ్వరి పేర్కొన్నారు.