BJP: విష్ణువర్ధన్ రెడ్డిపై బీజేపీ పెద్దల ఆగ్రహం.. పొత్తులపై మాట్లాడితే సస్పెన్షనే..!
ABN , Publish Date - Feb 19 , 2024 | 02:02 PM
బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందని సమాచారం. పొత్తులు, సీట్ల సర్దుబాటు పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంకోసారి పొత్తులపై మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని విష్ణువర్ధన్ రెడ్డిని అధిష్టానం హెచ్చరించిందట. విష్ణు వర్ధన్ రెడ్డితో పాటు పలువురు ఏపీ నేతలపై బీజేపీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారని టాక్. బీజేపీ నుంచే సీఎం అభ్యర్థి అని విష్ణువర్ధన్ రెడ్డి చేసిన ప్రకటనపై జాతీయ నేతలకు ఫిర్యాదులు అందాయి.
ఢిల్లీ: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందని సమాచారం. పొత్తులు, సీట్ల సర్దుబాటు పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంకోసారి పొత్తులపై మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని విష్ణువర్ధన్ రెడ్డిని అధిష్టానం హెచ్చరించిందట. విష్ణు వర్ధన్ రెడ్డితో పాటు పలువురు ఏపీ నేతలపై బీజేపీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారని టాక్. బీజేపీ నుంచే సీఎం అభ్యర్థి అని విష్ణువర్ధన్ రెడ్డి చేసిన ప్రకటనపై జాతీయ నేతలకు ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులపై పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరిని అడిగి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం.
పార్టీ జాతీయ సమ్మేళనంలో విష్ణు వ్యవహార శైలిపై అగ్రనేతలు సీరియస్ అయినట్లు పలువురు నేతలు వెల్లడించారు. రాష్ట్ర అధ్యక్షురాలి అనుమతి లేకుండా, ఇన్చార్జులకు తెలియకుండా ఎలా మాట్లాడుతావని విష్ణుపై అధిష్టానం ఫైర్ అయ్యిందట. ఇంకోసారి పార్టీకి తెలియకుండా పొత్తులు, ఇతర వ్యవహారాలపై మాట్లాడితే ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. పార్టీ నుంచి బహిష్కరిస్తామని తీవ్ర స్థాయిలో అగ్రనేతలు హెచ్చరించారట. పలువురు పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుల ముందే విష్ణుపై అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ నేతల ఆగ్రహంతో సమ్మేళనం నుంచి మధ్యలోనే విష్ణు వర్ధన్ రెడ్డి కదిరికి వెళ్లిపోయారని తెలుస్తోంది.