Purandeswari: జర్నలిస్టుపై పాశవిక దాడికి ఏపీ ప్రభుత్వం బాధ్యత వహించాలి
ABN , Publish Date - Feb 18 , 2024 | 10:21 PM
ముఖ్య మంత్రి జగన్ రెడ్డి అనంతపురం ‘‘సిద్ధం’’ సభలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి ప్రత్యక్ష ఉదాహరణ అని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandeswari ) అన్నారు.
ఆంధ్రప్రదేశ్: ముఖ్య మంత్రి జగన్ రెడ్డి అనంతపురం ‘‘సిద్ధం’’ సభలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి ప్రత్యక్ష ఉదాహరణ అని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandeswari ) అన్నారు. ఆదివారం నాడు ఓ ప్రకటన విడుదల చేశారు. పాత్రికేయ వృత్తి ఫోర్త్ ఎస్టేట్‌గా భావిస్తాం అటువంటిది ఫొటో జర్నలిస్టుపై పాశవిక దాడికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ దాడిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. పాత్రికేయ వృత్తిని గౌరవించలేని వారికి ప్రజాస్వామ్యం పై నమ్మకం ఏముంటుందని దగ్గుబాటి పురంధేశ్వరి ప్రశ్నించారు.