Home » Puttaparthi
ఓటరు జాబితా మా ర్పులు, చేర్పుల్లో పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్త వహించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు కన్నబాబు ఆదేశించారు. కలెక్టర్ టీఎస్ చేతనతో కలిసి కలెక్టరేట్లో ఆయన అఽధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు.
కక్షిదారులకు లోక్ అదాలతపై అవగాహన కల్పించి వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని ఎస్పీ వి.రత్న పేర్కొన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్సు హాల్లో కోర్టు కానిస్టేబుళ్లతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.
మడకశిర మండల పరిధిలోని ఆమిదాలగొంది జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో 8వతరగతి చదువుతున్న విద్యార్థి చేతన హత్య ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆరా తీశారు. అసలు ఏం జరిగింది అంటూ అధికారుల నుంచి సమాచారం తెలుసుకొన్నారు.
తాడిమర్రి మండలం కునుకుంట్ల గ్రామంలో నీరు లేక నిర్జీవంగా మారిన కుంటకు పీబీసీ ద్వారా నీరు ఇవ్వాలని ఆ గ్రామస్థులు టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్‌ను కోరారు.
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు పుట్టపర్తి(Puttaparthi)తో విడదీయరాని బంధం ఉంది. సామాజిక సేవ, దాతృత్వం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రతన్ టాటా.. సత్యసాయి బాబా సూచన మేరకు విద్యావాహిణి ప్రాజెక్టుకు సహకారం అందించారు.
పేద ఖైదీలకు సాధికార కమిటీ ఏర్పాటుచేయాలని కలెక్టర్ టీఎస్ చేతన అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికలో 171 ఫిర్యాదులు స్వీకరించారు.
స్వచ్ఛతాహి సేవపై ఏపీ పొల్యూషన కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో గురువారం స్థానిక శారదానగర్‌లోని జేఎనటీయూ రోడ్డులో ఉన్న సైన్సుసెంటర్‌లో విద్యార్థులకు వ్యాసరచన పోటీ లు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఇతర యాజమాన్య పాఠశాలల్లో చదువుతున్న సుమారు 200మంది విద్యార్థు లు హాజరయ్యారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చి వందరోజులు పూర్తి చే సుకున్న సందర్భంగా మండలంలోని పాముదుర్తి పంచాయతీలో సోమవారం ఇది మంచి ప్రభుత్వంలో ఎమ్మెల్యేతోపాటు, మాజీ మంత్రి పాల్గొన్నారు.
జిల్లాలో అక్రమ విద్యుత వాడకంపై విద్యుత శాఖ విజిలెన్స అధికారులు కొరడా ఝుళిపించారు. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి అక్రమ విద్యుత వాడకం దారులపై జరిమాన విధించారు. నగరంలోని డి-5సెక్షన, శ్రీ సత్యసాయి జిల్లాలోని ఓబుళదేవరచెరువు, అమరాపురం మండలాల్లో విద్యు త విజిలెన్స ఈఈ గోపి ఆధ్వర్యంలో అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు.
పెనుకొండ నుంచి కోనాపురం వెళ్లే రోడ్డు నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని మునిసిపల్ కమిషనర్ శ్రీనివాసులు గురువారం తెలిపారు. పెనుకొండ నగర పంచాయతీ రోడ్డు నుంచి కోనాపురం వెళ్లే రోడ్డు నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ఇటీడీపీ మడకశిర రహదారిలోని ఎగువ ప్రాంతం నుంచి మురుగు కాలువపై కల్వర్టు బ్లాక్ అయి మురుగునీరు రోడ్డుపై ప్రవహించింది.