Home » Puttaparthi
ప్రజలు కష్టాల్లో ఉండి బాధలు పడుతుంటే చూసి రాక్షసానందం పొందే వ్యక్తి జగన అని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి విమర్శించారు. అయితే కష్టా ల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండి వారిని అన్ని విధాలా ఆదుకుంటున్న ముఖ్య మంత్రి చంద్రబాబును చూసి జీర్ణించుకోలేక శిశుపాలుడితో పోల్చడం జగన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అన్నారు. వారు గురువారం స్థానిక ఆర్ అండ్‌బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు.
వరదలతో అతలాకుతలైన విజయవాడ ప్రాంత వాసులను ఆదుకుందామని సీపీఐ నాయకులు పిలుపునిచ్చారు. పట్టణంలోని రహమతపురం సర్కిల్, బాలాజీ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, మెయిన బజార్లలో బుధవారం వరద బాధితుల సహయార్థం వారు విరాళాలు సేకరించారు. రూ.30270 వసూలు చేశామని ఈ మొత్తాన్ని వరదబాధితుల సహయ నిధికి అందజే స్తామన్నారు.
ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా పెద్దిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్ బోధిస్తున్న ఉపాధ్యాయురాలు భాగ్యలక్ష్మిని శ్రీరంగరాజులపల్లికి బదిలీచేశారు. అయితే టీచర్ బదిలీని రద్దు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గత వారం పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపారు.
విజయవాడ వరద బాదితులకు అండగా హిందూపురం పట్టణ మహిళా సమాఖ్య సభ్యులు తమవంతు సాయం అందజేశారు. వారు సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1.5లక్షలు చెక్కును అందజేశారు. ఈ చెక్కును టీడీజీ జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట అంజినప్ప, మునిసిపల్ వైస్ చైర్మన బలరాంరెడ్డి, కౌన్సిలర్ డీఈ రమేష్‌కు అందించారు.
మండలంలోని పాలసముద్రం జాతీయ రహదారి కూడలి వద్ద ప్రభుత్వ స్థలంలో నివాసముంటున్న పేదలకు హక్కు పత్రాలివ్వాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమ వారం గోరంట్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు హనుమయ్య ఆధ్వర్యంలో కూడలి వద్ద నివాసమున్న పేదలు సోమవారం ఆందోళన చేపట్టారు.
పల్లెలు, పట్టణాలు తేడాలేకుండా వీధివీధినా బొజ్జగణపయ్య కొలువై భక్తకోటికి కనువిందు చేశాడు. వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం అనంతపురం నగరంలోను, నియోజకవరగంలోను ప్రజలు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వాడవాడల్లో గణనాథు డు కొలువుు దీరాడు. అయా మండపాల వద్ద ఘనంగా పూజలు నిర్వహించారు.
జీడిపల్లి రిజర్వాయర్ నుంచి హం ద్రీనీవా కాలువ ద్వారా గొ ల్లపల్లి రిజర్వాయర్‌కు నీ రు విడుదల చేయడంతో హంద్రీనీవా కాలువ గం డికి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని టీడీపీ నాయకుడు వెంక టేశ్వర్‌రావు హెచఎనఎస్ అధికారులకు సూచించారు. మండలంలోని కోనాపురం సమీపంలో మడకశిర బ్రాంచ కెనాల్ ఎల్-5 వద్ద వైసీపీ పాలన లో హంద్రీనీవా కాలువకు పడిన గండి టీడీపీ నాయకులు, హెచఎనఎస్ అధికారులు గురువారం పరిశీలించారు. గండిపడిన ప్రదేశం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మరమ్మతు పనులు ప్రారంభించారు
పట్టణంలోని వాసవీ ఆలయంలో ఆర్యవైశ్య అఫిషియల్స్ అండ్ ప్రొఫిషనల్స్ అసోసియేషన (అవోపా) ఆధ్వర్యంలో 250 మట్టి వినాయక ప్రతిమలను గురువారం పంపిణీచేశారు. ఈ కార్యక్రమానికి అవోపా జిల్లా అధ్యక్షుడు వెంకటేష్‌బాబు, ప్రధాన కార్యదర్శి జయంతి సత్యరామ్, జిల్లా మాజీ అధ్యక్షుడు జయంతి శ్రీనివాసులు, ముఖ్య అతిథులు గా హాజరైయ్యారు.
పురంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేసే పారిశుధ్య కార్మికులు నాలుగు నెలలుగా జీతాలు అందకపోవ డంతో తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. పనులు చేసి పస్తులుం డాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హిందూపురం ప్రభు త్వాసుపత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 26 మంది పారిశుధ్య కార్మికులు ఉన్నారు. వారు గురువారం ప్రభుత్వ ఆసుపత్రిలో పనులు బహష్కరించి ని రసన తెలిపారు.
దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం అని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు. భావిభారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత వారిపైనే ఉందన్నారు. పట్టణంలోని ఉపాధ్యాయ భవనలో గురువారం ఉపా ధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు.