Home » Raghunandan Rao
Telangana: పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్కు స్థానిక అభ్యర్థి దొరకకపోవడం బాధాకరమని బీజేపీ మెదక్ పార్లమెంటరీ అభ్యర్థి రఘునందన్ రావు వ్యాఖ్యలు చేశారు. శనివారం జిల్లాలోని మర్కుక్ మండల కేంద్రంలో రంగనాయక స్వామి ఆలయంలో రఘునందన్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆపై బీజేపీ బూత్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, హరీష్‌రావులకు తెలంగాణలో మెదక్ పార్లమెంటు అభ్యర్థికి పోటీ చేయడానికి ఒక్కరు కూడా దొరకలేదా అని ప్రశ్నించారు.
సొంత అవసరాల కోసం కొంతమంది నేతలు పార్టీలు మారుతున్నారని బీజేపీ సీనియర్ నేత రఘునందనరావు (Raghunandan Rao) అన్నారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కొడుకుకు టికెట్ ఇస్తే బీజేపీలో ఉండేవారని...టికెట్ ఇవ్వకపోతే పార్టీ మంచిది కాదా అని ప్రశ్నించారు.
కమలం పార్టీ తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరదీసింది. పెండింగ్ పార్లమెంట్ స్థానాలపై బీజేపీ కసరత్తు నిర్వహిస్తోంది. 17కు గాను.. 9పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. బలహీనంగా ఉన్న చోట చేరికలను కమలం పార్టీ ప్రోత్సహిస్తోంది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం వేట కొసాగిస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి బీజేపీకి, బీఆర్ఎస్ పొత్తు అని తనకెలా తెలుసునని బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు(Raghunandan Rao) ప్రశ్నించారు. ‘భారత్ వికసిత సంకల్ప యాత్ర’లో రఘునందన్ రావు, గోదావరి అంజిరెడ్డి, పులిమమిడి రాజు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Telangana: పాలకుల చిత్తశుద్ధి లోపంతోనే ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం పఠాన్ చెరు ఏలాంటి అభివృద్ధి చెందలేదని మాజీ ఎమ్మెల్యే రఘుందన్ రావు విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఈదుల నాగులపల్లిలో రైల్వే టెర్మినల్ భూసేకరణ వద్దే ఆగిపోవటం విచారకరమన్నారు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత అల్లుడు తూర్పుకు, కొడుకు పడమరకు పోతారని.. ఇక బీఆర్ఎస్ ఫాంహౌస్‌కు పరిమితం అయిందని బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు(Raghunandan Rao) అన్నారు.
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఆ నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్న వార్త సంచలనాన్ని రేపుతోంది. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందిస్తూ.. బీఆర్ఎస్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Telangana: అధికారం కోల్పోయాక కార్యకర్తలు గుర్తొచ్చారా అంటూ బీఆర్ఎస్ను బీజేపీ నేత రఘునందనరావు ఎద్దేవా చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమకారులకు సీట్లు ఇస్తామంటోన్న కేటీఆర్.. మాటను నిలబెట్టుకోవాలన్నారు.
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని ఆ పార్టీ నేత రఘునందన్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Telangana: కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కాగ్ నివేదిక అడిగిందని.. మార్చ్ 2023లోనే కాగ్ లేఖ పంపిందని బీజేపీ నేత రఘునందనరావు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తమ బండారం ఎక్కడ బయట పడుతుందో అని భయపడి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దాచి పెట్టిందన్నారు.