Share News

MP Raghunandan Rao: బీఆర్ఎస్ నేతల భవనాలు కూల్చివేయాలి..

ABN , Publish Date - Aug 24 , 2024 | 04:46 PM

హైడ్రా కూల్చివేతలపై బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress) నేతల డ్రామాలు రక్తికట్టించేలా ఉన్నాయని మెదక్ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) అన్నారు. మంచి ఉద్దేశంతో హైడ్రా ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోందని.. అదే నిజం అయితే ముందు బీఆర్ఎస్ నేతలు ఆక్రమించి కట్టిన భవనాలను కూల్చివేయాలంటూ ఎంపీ డిమాండ్ చేశారు.

MP Raghunandan Rao: బీఆర్ఎస్ నేతల భవనాలు కూల్చివేయాలి..
MP Raghunandan Rao

హైదరాబాద్: హైడ్రా కూల్చివేతలపై బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress) నేతల డ్రామాలు రక్తికట్టించేలా ఉన్నాయని మెదక్ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) అన్నారు. మంచి ఉద్దేశంతో హైడ్రా ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోందని.. అదే నిజం అయితే ముందు బీఆర్ఎస్ నేతలు ఆక్రమించి కట్టిన భవనాలను కూల్చివేయాలంటూ ఎంపీ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫామ్ హౌస్‌లు కూల్చడానికి ఎందుకు భయపడుతున్నారో చెప్పాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.


రేవంత్ రెడ్డికి భయం..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్‌ పార్టీకి భయపడుతున్నారని ఎంపీ రఘునందన్ విమర్శించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కబ్జాలు పెరిగాయని, కేసీఆర్ హయాంలో ఆక్రమణలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ముందుగా జన్వాడలో కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఫామ్ హౌస్ కూల్చివేయాలంటూ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కబ్జాలు చేసిన నేతలపై కేసులు పెట్టామని అధికార పార్టీ నేతలు చెప్తున్నారని, అదే నిజమైతే వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదని ఎంపీ ప్రశ్నించారు.


కేటీఆర్ చెప్పాలి..

సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేయాలంటూ 2014లోనే హైకోర్టు ఆదేశించిందని రఘునందన్ రావు గుర్తు చేశారు. అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలంటూ ఆయన ప్రశ్నించారు. ఎన్ కన్వెన్షన్ వెనక లాలూచీ ఏంటో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. చెరువుల ఆక్రమణలపై చర్యలు తీసుకోని కేటీఆర్‌ను మొదటి ముద్దాయిగా అరెస్టు చేయాలంటూ రేవంత్ రెడ్డిని ఆయన డిమాండ్ చేశారు.


మిరాలం చెరువు పరిస్థితి ఏంటి..?

2010లో ఎఫ్టీఎల్, శిఖం భూముల్లో ఎవరు ఏం కట్టినా కూల్చివేయాలంటూ కోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని రఘునందర్ రావు గుర్తు చేశారు. ఈ తీర్పుతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 157జీవో తెచ్చిందని తెలిపారు. ఈ మేరకు 18మందితో లేక్ ప్రొటెక్షన్ కమిటీనీ ఏర్పాటు చేసిందని ఎంపీ వెల్లడించారు. అయినప్పటికీ ఇప్పుడు మిరాలం ట్యాంక్ పరిస్థితి ఏంటో రేవంత్ రెడ్డి చెప్పాలని రఘునందర్ రావు డిమాండ్ చేశారు. మిరాలం చెరువు కబ్జాపై 1994లోనే అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్పందించిన విషయాన్ని ఎంపీ రఘునందన్ రావు గుర్తు చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Bhatti: హైడ్రా కూల్చివేతలపై డిప్యూటీ సీఎం భట్టి రియాక్షన్ ఇదీ..!

N Convention: ఎన్ కన్వెన్షన్ విషయంలో హైకోర్టు స్టే ఇవ్వడమేంటి..!?

Updated Date - Aug 24 , 2024 | 04:52 PM