TG News: హైడ్రాకు చట్టబద్దత కల్పించాలి:ఈటల రాజేందర్
ABN , Publish Date - Sep 19 , 2024 | 08:00 PM
కాంగ్రెస్ ప్రభుత్వంలో కుమ్ములాటలు భయటపడకుండా హెడ్రా పేరుతో డైవర్షన్ చేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శలు చేశారు. పేదల భూములు రేవంత్ జాగీర్ కాదని హెచ్చరించారు. చెరువులు, వాగుల రక్షణకు భూసేకరణ చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
జనగామ: హైడ్రాకు ఎలాంటి చట్టబద్దత లేదని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్‌లో చర్చించి హైడ్రాకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇవాళ(జనగామ)లో ఈటల రాజేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో కుమ్ములాటలు భయటపడకుండా హెడ్రా పేరుతో డైవర్షన్ చేస్తున్నారని విమర్శలు చేశారు. పేదల భూములు రేవంత్ జాగీర్ కాదని హెచ్చరించారు. చెరువులు, వాగుల రక్షణకు భూసేకరణ చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
ALSO Read: Telangana: అక్కసుతోనే ఆరోపణలు.. విపక్షాలపై మంత్రి ఆగ్రహం..
హైడ్రా లాంటి వ్యవస్థ తేవాలి: ఎంపీ రఘునందన్ రావు
సంగారెడ్డి జిల్లా: అన్ని మునిసిపాలిటీల్లో హైడ్రా లాంటి వ్యవస్థ తేవాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. ఆమీన్ పూర్‌లో ప్రైవేట్ సర్వే నెంబర్ వేసి ప్రభుత్వ భూమిలో అపార్ట్‌మెంట్ కట్టారని చెప్పారు. రెవెన్యూ అధికారులు అపార్ట్ మెంట్‌లో ఉంటున్న వారికి నోటీసులు ఇచ్చారని గుర్తుచేశారు. అమాయకులు ఎంతో మంది ఇలా నష్టపోతున్నారని చెప్పారు. ఇవాళ(గురువారం) సంగారెడ్డిలో పర్యటించారు. ఈ సందరన్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ... బీఆర్ఎస్ హయాంలో పదేళ్లలో ఆస్పత్రుల్లో ఎన్నో మరణాలు సంభవించాయని ఆరోపణలు చేశారు.
ALSO Read: Adi Srinivas: కేటీఆర్.. మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు
తెలంగాణలో అధికారం కోల్పోయామనే బాధలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ అర్ధరహితమైన .మాటలు మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు. ఒక సంఘటనను చూపించి.. కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో ఏదో మార్పు జరగాలని కోరడం ఏంటని ప్రశ్నించారు. తాను కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడటం లేదని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్లలో ఏం చేయలేని అసమర్థులని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఆస్పత్రులను అద్భుతంగా చేసుంటే .. ఆ డాక్టర్లకు కల్పించాల్సిన సౌకర్యాలు ఏమయ్యాయని నిలదీశారు.
గాంధీలో ఎంతమంది చనిపోయారో బీఆర్ఎస్ హయం నుంచి ఇప్పటివరకు లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల కోసం విమర్శించడం సరికాదని అన్నారు. రైతు ఆత్మహత్యలు బీఆర్‌ఎస్ హయాంలో జరిగాయి.. ఇప్పుడు జరుగుతున్నాయని చెప్పారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ప్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారని ఎంపీ రఘునందన్ రావు అన్నారు
ఈ వార్తలు కూడా చదవండి