Home » Railway Zone
సహజ సిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలకు.. కొత్తవలస-కిరండోల్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులతో ముప్పు వాటిల్లేలా ఉంది. రెండో ట్రాక్‌ను బొర్రా గుహలపై నుంచి నిర్మిస్తే గుహలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.
గుంతకల్లు, జూలై 6: ఎప్పుడూ ఒక శాతం కమీషన(లంచం) తీసుకునేవారట..! కానీ ఈసారి ఇంకొక్కశాతం ఎక్కువ కావాలని అడిగారట. ఆ దురాశే వారిని ఊచలు లెక్కబెట్టేలా చేసింది. సీబీఐ వలలో చిక్కి.. పరువు బజారున పడేలా చేసింది. గుంతకల్లు రైల్వే డివిజన కేంద్రంలో తొలిసారి సీబీఐ దాడులు జరగడానికి కారణం ఇదే అంటున్నారు. డీఆర్ఎం కార్యాలయంలో ఓ శాఖాధికారిపై కాంట్రాక్టర్లు చేసిన ఫిర్యాదు అవినీతి వృక్షాలను పెకిలించింది. రైల్వే అకౌంట్స్ విభాగంలో అవినీతి బురద డీఆర్ఎం కార్యాలయానికి మాసిపోని మరకలను అంటించింది. తిరుపతిలో ఆరు నెలల కిందట జరిగిన సీబీఐ దాడులు మరువకనే.. అంతకు మించిన అవినీతిని బయట పెట్టేదాడులు గుంతకల్లులో ..
రైళ్లలో త్వరలో కొత్తగా 2,500 జనరల్ బోగీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ బోగీల తయారీకి ఆమోదం తెలిపినట్లు రైల్వే మంత్రి ఆశ్విన్ వైష్ణవ్ తెలిపారు.
రాజమండ్రి: రైల్వే అధికారులు సోమవారం నుంచి 45 రోజులపాటు 26 రైళ్లను రద్దు చేశారు. రద్దు చేసిన వాటిలో రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి, సర్కార్ ఎక్స్‌ప్రెస్ సహా డిమాండ్ ఉన్న రైళ్లను అధికారులు రద్దు చేశారు. దీంతో విజయవాడ, విశాఖ, తిరుపతి, హైదరాబాద్ వెళ్లేవారికి తీవ్ర ఇబ్బందులు కలగనున్నాయి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆలుగడ్డ బావి వద్ద ఉన్న రైల్వే వాషింగ్ సైడ్ వద్ద ఆగి ఉన్న ఓ కొత్త రైలు రెండు బోగీలకు మంటలంటుకొని అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరుగలేదు.
వందేభారత్ రైల్లో సరఫరా చేస్తున్న భోజనంలో బొద్దింక రావడంతో సదరు ప్రయాణికులు షాకైయ్యారు. మంగళవారం భోపాల్ నుంచి ఆగ్రాకు వెళ్తున్న ఓ దంపతులకు ఐఆర్సీటీసీ అందించిన భోజనంలో చనిపోయిన బొద్దింక వచ్చింది.
రాష్ట్ర ఆర్థిక శాఖ సెక్రటరీ సత్యనారాయణను విధుల నుంచి రిలీవ్ చేసేందుకు ప్రభుత్వం బ్రేకులు వేసింది. ఆయనపై వచ్చిన ఆర్థిక అవకతవకల ఆరోపణల నిగ్గు తేలేవరకు ఆయనను రాష్ట్రంలోనే ఉంచాలని నిర్ణయించుకుంది.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిన ఐఆర్ఏఎస్ అధికారి కేవీవీ సత్యనారాయణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చల్లగా జారుకున్నారు. తన మాతృశాఖ రైల్వే్‌సకు వెళ్లిపోయారు. నార్త్ ఈస్టర్న్ రైల్వేలో జాయిన్ కావాల్సిందిగా ఈ నెల 13వ తేదీన రైల్వే బోర్డు ఆయనకు ఆదేశాలిచ్చింది.
రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసే ముఠాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం రైల్ నిలయం అడ్డాగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మోసగాళ్ల వలలో చిక్కుకుని పలువురు నిరుద్యోగులు లక్షలాది రూపాయలు పోగొట్టుకొని లబోదిబోమంటున్నారు.
Andhrapradesh: ఏపీలో జరుగుతున్న ఎన్నికలకు ఈసారి పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలివస్తున్నారు. ఎన్నికలు, పైగా వరుసగా సెలవులు రావడంతో తెలుగు ప్రజలు ఏపీ బాట పట్టారు. ఇప్పటికే చాలా మంది ప్రజలు తమ స్వంత గ్రామాలకు చేరుకోగా... చివరి గంటలో అయినా ఓటు హక్కు వినియోగించుకోవాలని భావించిన అనేక మంది ఈరోజు కూడా ఏపీకి పయనమయ్యారు. ఇదే విధంగా విశాఖకు చెందిన పలువురు ఓటర్లు ఓటు వేసేందుకు స్పెషల్ ట్రైన్లో బయలుదేరారు.