Home » Rain Alert
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో దక్షిణ మధ్య రైల్వే 80 రైళ్లను పూర్తిగా, 5 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. 49 రైళ్లను ఇతర ప్రాంతాల మీదుగా మళ్లించింది.
భారీ వర్షం, ఉరుములు, మెరుపులు.. కళ్లెదుట రోడ్డుపై పొంగి ప్రవహిస్తోన్న నీళ్లు.. ఉన్న చోట నుంచి కదల్లేని పరిస్థితి.. తిండి లేదు, నిద్ర లేదు.. రెప్ప పడితే రేపటిని చూస్తామో లేదో తెలియని భయం..
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ ప్రవాహం ప్రధాన రహదారులపైకి వచ్చి వాహనాలు ప్రయాణించేందుకు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది.
భారీ వర్షాలతో ఖమ్మం సమీపంలోని మున్నేరు ఉప్పొంగడంతో నగరంలోని ప్రకాశ్‌నగర్ బిడ్జిపై చిక్కుకున్న 9 మంది ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డారు.
తన సోదరుడి నిశ్చితార్థం కోసం బెంగుళూరు నుంచి స్వగ్రామనికి వచ్చిన మహిళా యువశాస్త్రవేత్త.. తిరుగు ప్రయాణంలో అనూహ్యంగా వరదలో చిక్కుకొని.. మృతి చెందింది.
ఖమ్మంలోని కరుణగిరి సాయికృష్ణనగర్‌లో మున్నేరు వరదలో ఓ భవనంపై పిల్లలతో సహా చిక్కుకున్న పది మంది సురక్షితంగా బయటపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా కురుస్తున్న వర్షాలు కొన్ని కుటుంబాల్లో విషాదాన్ని మిగుల్చుతున్నాయి. విజయవాడలో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతిచెందగా.. మరో నలుగురు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన బాధిత కుటుంబాల్లో తీవ్ర రోదనలు మిగిల్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు(Rains) కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) సీఎంవో అధికారులతో సమావేశమయ్యారు. ఏపీలో భారీ వర్షాలపై సీఎం ఆరా తీశారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎంవో అధికారులు ముఖ్యమంత్రికి భారీ వర్షాలు, ఆయా జిల్లాల్లో తాజా పరిస్థితులపై వివరించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలతో ముంచెత్తుతోంది. వర్షాల ధాటికి నదులు, వాగులు, వంకల పొంగిపొర్లుతున్నాయి. ఇళ్లల్లోకి వరదనీరు చేరి ప్రజలు నానావస్థలు పడుతున్నారు. పంటలు నీట ముగిని తీవ్రనష్టం వాటిల్లడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం అర్ధరాత్రి 12:30నుంచి 2:30 మధ్య వాయుగుండం తీరం దాటింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాను వరదలు కుదిపేస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి. ఎక్కడ చూసిన వరద నీటిలో ప్రజలు తీవ్రఅవస్థలు పడుతున్నారు. ఇళ్లల్లోకి నీరు చేరడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికారులు తమను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు.