Home » Rains
ఆంధ్రప్రదేశ్లో రెండు రోజులుగా భారీ వర్షాలు కరుస్తున్నాయి. వానలు కుండపోతగా పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం ధాటికి పలు కాలనీలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల వాసులు బిక్కుబిక్కుమంటు ఉంటున్నారు.
భారీ వర్షాల కారణంగా విజయవాడ డివిజన్లో చాలా చోట్ రైల్వే ట్రాక్స్ పూర్తి దెబ్బ తిన్నాయి. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆయా ప్రాంతాలకు రైళ్ల ప్రయాణాలు సాగలేని పరిస్థితి నెలకొంది. భారీ వరద కారణంగా విజయవాడ..
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు నేపద్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు గోదావరి నది తీరం వెంబడి అధికారులు..
తెలంగాణలో రెండు రోజులుగా భారీ వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. వానలు ఏకధాటిగా పడుతుండటంతో ఖమ్మం నగరంలోని మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మున్నేరు వాగుకు పై నుంచి వచ్చే నీటి తీవ్రతతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. జనజీవనం ఎక్కడికక్కడే స్థంభించింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం, అంబారుపేట వద్ద జాతీయ రహదారిపై వరదనీరు భారీగా చేరింది.
రాష్ట్రంలో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తుండటం, సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నందున వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ(Damodara Rajanarsimha) అధికారులతో సమావేశమయ్యారు.
భారీ వర్షాలకు గన్నవరం రూరల్ మండలం అంబాపురంలో దయనీయ పరిస్థితి ఏర్పడింది. గ్రామాన్ని వరదనీరు ముంచెత్తడంతో ప్రజలు రక్షించాలంటూ ఆక్రందనలు పెడుతున్నారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు సైతం గ్రామానికి చేరుకుని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కోసం వేచి చూస్తున్నారు. ఫోన్ చేసినా అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ప్రాజెక్టులలోకి భారీగా వరదనీరు చేరుతుంది. బ్రిడ్జీల పైన, రైల్వే ట్రాక్ వద్దకు భారీగా వర్షపునీరు చేరింది. దాంతో కొన్ని రైళ్లను నిలిపివేశామని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
ఆర్టీసీ బస్సు వరంగల్ నుంచి మహబుబాబాద్ వెళుతోంది. నెక్కొండ మండలం వెంకటాపురం వద్ద చెరువు మత్తడి పొంగిపొర్లుతుంది. తోపనపల్లి చెరువు పొంగి ప్రవహించడంతో కట్టపై ఉన్న బస్సు వరద నీటిలో నిలిచిపోయింది.
ఆంధ్రప్రదేశ్లో భారీగా కురుస్తున్న వర్షాలు కొన్ని కుటుంబాల్లో విషాదాన్ని మిగుల్చుతున్నాయి. విజయవాడలో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతిచెందగా.. మరో నలుగురు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన బాధిత కుటుంబాల్లో తీవ్ర రోదనలు మిగిల్చింది.