Share News

Heavy Rains: విజయవాడలో భారీ వర్షాలు.. ఓ బిల్డింగ్‎లో చిక్కుకున్నా 17 మంది వ్యక్తులు

ABN , Publish Date - Sep 01 , 2024 | 07:10 PM

ఆంధ్రప్రదేశ్‎లో రెండు రోజులుగా భారీ వర్షాలు కరుస్తున్నాయి. వానలు కుండపోతగా పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం ధాటికి పలు కాలనీలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల వాసులు బిక్కుబిక్కుమంటు ఉంటున్నారు.

Heavy Rains: విజయవాడలో భారీ వర్షాలు.. ఓ బిల్డింగ్‎లో చిక్కుకున్నా 17 మంది వ్యక్తులు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‎లో రెండు రోజులుగా భారీ వర్షాలు కరుస్తున్నాయి. వానలు కుండపోతగా పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం ధాటికి పలు కాలనీలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల వాసులు బిక్కుబిక్కుమంటు ఉంటున్నారు. అయితే విజయవాడ నగర సరిహద్దులోని జేఎన్యూరామ్ కాలనీ 5 వ బ్లాక్ పక్కన ఒక బల్డింగ్ పైన17 మంది వ్యక్తులు చిక్కుకున్నారు. నిన్న సాయంత్రం నుంచి తమకు మంచినీళ్లు కూడా ఇచ్చేవారు లేరని స్థానికులకు వారు ఫోన్లు చేసి సమాచారం అందిస్తున్నారు.

తమలో నలుగురు షుగర్ పేషెంట్లు ఉన్నారని తమను రక్షించాలని వేడుకుంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్ వచ్చి వరద ప్రవాహం ఎక్కువగా ఉందని వెళ్లి పోయారని అక్కడున్న వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమను ఉన్నతాధికారులు రక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 9399183711 ఈ నంబర్ కు ఫోన్ చేసి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వెంటనే ఆదుకోవాలని వారు అర్తనాదాలు చేస్తున్నారు.


విజయవాడలో అంధకారం...

ఎన్టీఆర్ జిల్లా: విజయవాడ నగరంలోని 12 డివిజన్లు అంధకారంలో ఉన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ బంద్ అయింది. కరెంట్ లేకపోవడంతో ప్రజానీకం అల్లాడుతున్నాదు. కనీసం క్యాండిల్స్ అయినా వెంటనే సప్లై చేయాలని వరద బాధితులు కోరుతున్నారు. రోడ్లు మొత్తం వరద నీరు చుట్టుముట్టడంతో కరెంటు పునరుద్ధరణ చేయలేని పరిస్థితుల్లో విద్యుత్ శాఖ అధికారులు ఉన్నారు.


దేవినేని, టీడీపీ నేతల ఫుడ్ ప్యాకెట్ల పంపిణీ

ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ రూరల్): జక్కంపూడి కాలనీ లోడర్ సాయంతో ముంపు ప్రాంతంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పర్యటిస్తున్నారు. లోడర్ సాయంతో సహాయక చర్యల్లో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. కాలనీ ముంపు బాధితులకు ఆహారాన్ని (ఫుడ్ పాకెట్స్) పంపిణీ చేశారు.


రైల్వే ప్రయాణికులకు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సాయం

పల్నాడు జిల్లా: రైల్వే ప్రయాణకులకు బాసటగా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నిలుస్తున్నారు. నడికూడి రైల్వే స్టేషన్‎లో ప్రయాణికులకు ఆహారం పంపిణీ చేశారు. విజయవాడ నుంచి అత్యధిక రైళ్లు నడికూడి మీదగా మళ్లించారు. నడికూడి స్టేషన్‎లో ప్రయాణికులకు ఆహారం , మంచినీటిని యరపతినేని కుమారుడు నిఖిల్ అందించారు. వరదల వల్ల ప్రయాణాలు ఆలస్యం అవుతుండటంతో ఆహారం అందిస్తున్నారు. వరద పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు నడికూడి స్టేషన్‎లో ప్రయాణికులకు అండగా ఉంటామని తెలిపారు.


అధికారులు, మంత్రులకు సహాయక చర్యల బాధ్యతలు...

అమరావతి: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, మంత్రులకు సీఎం చంద్రబాబు బాధితుల సహాయక చర్యల బాధ్యతలు అప్పగించారు. నిమిషాల లెక్కన అప్పగించిన బాధ్యతలను పూర్తి చేయాలని వారికి సీఎం ఆదేశించారు. నగరంలో వెంటనే అన్ని షాపుల నుంచి బిస్కట్లు, పాలు క్యాండిల్స్ తెప్పించాలని సీఎం సూచించారు.


గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యే శ్రావణ కుమార్ పర్యటన

గుంటూరు: జిల్లాలోని తుళ్లూరు మండలంలో కృష్ణ నది సమీప గ్రామాల్లో ఎమ్మెల్యే తాడికొండ శ్రావణ కుమార్ పర్యటిస్తున్నారు. హరిశ్చంద్రపురం గ్రామంలో వరద ఉదృతిని ఎమ్మెల్యే శ్రావణ కుమార్. పరిశీలించారు. వరద పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే శ్రావణ కుమార్ సూచించారు.

Updated Date - Sep 01 , 2024 | 07:24 PM