AP Rains: ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు.. వివరాలివే..
ABN , Publish Date - Sep 01 , 2024 | 05:49 PM
భారీ వర్షాల కారణంగా విజయవాడ డివిజన్‌లో చాలా చోట్ రైల్వే ట్రాక్స్ పూర్తి దెబ్బ తిన్నాయి. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆయా ప్రాంతాలకు రైళ్ల ప్రయాణాలు సాగలేని పరిస్థితి నెలకొంది. భారీ వరద కారణంగా విజయవాడ..
విశాఖపట్నం, సెప్టెంబర్ 1: భారీ వర్షాల కారణంగా విజయవాడ డివిజన్‌లో చాలా చోట్ రైల్వే ట్రాక్స్ పూర్తి దెబ్బ తిన్నాయి. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆయా ప్రాంతాలకు రైళ్ల ప్రయాణాలు సాగలేని పరిస్థితి నెలకొంది. భారీ వరద కారణంగా విజయవాడ డివిజన్లో రాయనపాడు వద్ద రైల్వే ట్రాక్స్ పూర్తిగా దెబ్బ తిన్నాయి. దీంతో పలు రైళ్లను రద్దు చేశారు. విశాఖపట్నం నుంచి వెళ్లాల్సిన తొమ్మిది ట్రైన్స్‌ను క్యాన్సిల్ చేశారు.
రద్దైన రైళ్ల వివరాలు..
విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్.
హైదరాబాద్ షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్.
సికింద్రాబాద్ హౌరా పలకనామ ఎక్స్‌ప్రెస్.
మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్.
విశాఖపట్నం హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్.
విశాఖపట్నం సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్.
విశాఖపట్నం లోకమాన్య టెర్మినల్ ఎక్స్‌ప్రెస్.
హైదరాబాదు నుండి విశాఖపట్నం రావాల్సిన మూడు ట్రైన్లు రద్దు.
ఏపీ ఎక్స్‌ప్రెస్ దారి మళ్లింపు.
బెంగళూరు భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రీ షెడ్యూల్ చేశారు.
విశాఖ ఎక్స్‌ప్రెస్ రీ షెడ్యూల్ చేశారు.
వాహనాలను నిలిపివేస్తున్న పోలీసులు..
ఇదిలాఉండగా.. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వరద నీరు రావడంతో ట్రాఫిక్త భారీగా స్తంభించింది. హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలను చిలకల్లు లోట్ ప్లాజా వద్ద నిలిపివేస్తున్నారు పోలీసులు. జాతీయ రహదారిపై నందిగామ వద్ద ఐతవరం వద్ద వరద ప్రభావం ఉధృతంగా వస్తోంది. దీంతో అలర్ట్ అయిన అధికారులు ట్రాఫిక్‌ను నిలిపివేస్తున్నారు. ప్రయాణీకులు అందరూ వరద పరిస్థితిని పరిశీలించి ప్రయాణాలు పెట్టుకోవాలని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సూచించారు. కాగా, విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాలను నందిగామ వద్ద నిలిపివేస్తున్నారు.