Home » Rajasthan
రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఇటీవల సంచలనం సృష్టించిన కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగమేది హత్య కేసులో కుమార్ అనే కీలక అనుమానితుడిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బుధవారంనాడు అరెస్టు చేసింది. కుమార్ నివాసంలో పలు ఆయుధాలు, అమ్యునేషన్ స్వాధీనం చేసుకుంది.
ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ సారథ్యంలోని రాజస్థాన్ ప్రభుత్వం శనివారంనాడు మంత్రివర్గాన్ని విస్తరించింది. కొత్తగా 22 మందిని మంత్రివర్గంలోకి తీసుకుంది. వీరిలో 12 మంది క్యాబినెట్ మంత్రులు, 10 మంది సహాయ మంత్రులు ఉన్నారు.
రాజస్థాన్‌లోని జైపూర్‌లో సంచలనం సృష్టించిన కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగమేది హత్య కేసును ఎన్ఐఏకు అప్పగించినట్టు కేంద్ర హోం శాఖ మంగళవారంనాడు ప్రకటించింది. ఈ నేరంలో గ్యాంగ్స్టర్ల ప్రమేయం ఉన్నందున కేసు మొత్తం యాంటీ టెర్రర్ ప్రోబ్ ఏజెన్సీ ఎన్ఐఏకు అప్పగించినట్టు తెలిపింది.
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఎకాఎకిన సీఎం పీఠాన్ని చేపట్టిన ఘనత భజన్‌లాల్ శర్మకు దక్కుతుంది. రాజస్థా్న్ కొత్త ముఖ్యమంత్రిగా ఆయన శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. జైపూర్‌లోని రామ్నివాస్ బాగ్‌లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయన చేత గవర్నర్ కల్రాజ్ మిశ్రా ప్రమాణస్వీకారం చేయించారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్ష్‌కి బీజేపీకి తొమ్మిదిరోజుల తర్వాత తెరదించింది. కొత్త సీఎంగా భజన్‌లాల్ శర్మ పేరును ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర పరిశీలకులు రాజ్‌నాథ్ సింగ్, సరోజ్ పాండే, వినోద్ తవాడే సమక్షంలో జరిగిన సీఎల్పీ సమావేశానంతరం ఏకగ్రీవంగా భజన్‌లాల్ పేరును ప్రకటించారు.
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రుల ఎంపికలో పరిశీలకుల అంచనాలను తలక్రిందులు చేస్తూ బీజేపీ అధిష్ఠానం నిర్ణయాలు తీసుకున్న క్రమంలో రాజస్థాన్ సీఎం విషయంలోనూ ఇదే జరగనుందంటూ బీజేపీ మాజీ ఎంపీ, రాజస్థాన్ ఎమ్మెల్యే కిరోడి లాల్ మీనా చలన 'హింట్' ఇచ్చారు.
జైపూర్: రాజస్థాన్ (Rajasthan) కొత్త ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకున్నారనే సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ ఈసారి "నారీ శక్తి''కే పెద్దపీట వేసే అవకాశాలున్నాయని బలంగా వినిపిస్తోంది. రేసులో తొమ్మిది మంది మహిళా సీఎం అభ్యర్థులు ఉన్నారు.
రాజస్థాన్ లో సంచలనం సృష్టించిన రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీ హత్య కేసులో ముగ్గురు కీలక నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, రాజస్థాన్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ప్రధాన నిందితులను ఛండీగఢ్‌లో పట్టుకున్నట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ని సేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని దారుణంగా కాల్చిచంపిన ఇద్దరు షూటర్లను రాజస్థాన్ పోలీసులు గుర్తించారు. సుఖ్‌దేవ్ సింగ్‌ను ఆయన నివాసంలోనే అతిసమీపం నుంచి దుండగులు మంగళవారం కాల్పిచంపారు.
దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కి చెందిన రోహిత్ గోదారా అనే వ్యక్తి..