కొలువుల భర్తీకి ఇకపై ‘ట్యాబ్’ ఆధారిత పరీక్షలు
ABN , Publish Date - Nov 17 , 2024 | 04:10 AM
పోటీ/ప్రవేశ పరీక్షల్లో ఆప్టికల్ మార్క్ రీడర్(ఓఎంఆర్), కంప్యూటర్ ఆధారిత పరీక్షల(సీబీటీ)ను చూశాం.
రాజస్థాన్ సర్కారు నిర్ణయం..ఐఐటీ హ్యాకర్లతో ట్రయల్
జైపూర్, నవంబరు 16: పోటీ/ప్రవేశ పరీక్షల్లో ఆప్టికల్ మార్క్ రీడర్(ఓఎంఆర్), కంప్యూటర్ ఆధారిత పరీక్షల(సీబీటీ)ను చూశాం. ఇకపై ట్యాబ్/ట్యాబ్‌లెట్ ఆధారిత పరీక్షల(టీబీటీ)ను నిర్వహించాలని రాజస్థాన్ సర్కారు నిర్ణయించింది. మాస్ కాపీయింగ్, పేపర్ లీకేజీ, ట్యాంపరింగ్ వంటి సమస్యలకు టీబీటీతో చెక్ పట్టవచ్చని భావిస్తోంది. ఈ విషయాన్ని రాజస్థాన్ స్టాఫ్ సెలక్షన్ బోర్డు(ఆర్‌జేఎ్‌సఎ్‌సబీ) చైర్మన్ అలోక్‌రాజ్ వెల్లడించారు. లీకేజీ రహితంగా పరీక్షల నిర్వహణకు టీబీటీని పరిశీలిస్తున్నట్లు వివరించారు. ‘‘ఈ నెలాఖరులో 400 మంది డమ్మీ విద్యార్థులతో షిఫ్టుల వారీగా మాక్‌టెస్ట్ నిర్వహిస్తాం. పరీక్ష ప్రారంభానికి ముందు.. పరీక్ష జరుగుతున్నప్పుడు లీకేజీ, కాపీయింగ్ సాధ్యమవుతుందా? అనే కోణంపైనా దృష్టిపెట్టాం. మాక్‌టెస్ట్ సమయంలో ఐఐటీ-కాన్పూర్‌కు చెందిన హ్యాకర్లను నియమించి.. ప్రశ్నపత్రం లీకేజీకి ప్రయత్నిస్తాం. హ్యాకర్లు విఫలమైతే.. టీబీటీ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలుచేస్తాం’’ అని చెప్పారు.