Jaipur Literature Festival: ప్రపంచ సాహిత్య మహా కుంభమేళాకు కౌంట్‌డౌన్
ABN , Publish Date - Dec 20 , 2024 | 03:24 PM
ప్రపంచ భాషలు, సంస్కృతీ సంపదలు, ప్రస్తుత పరిణామాలు, పుస్తక ప్రపంచంతో మమేకం కావాల్సిన అవసరం సహా తమ ఆలోచనలను అందరితో పంచుకునేందుకు విశిష్ఠ వేదకిగా జైపూర్ లిటరేచర్ ఫెస్టవిల్ నిలవనుంది.
జైపూర్: ప్రపంచ పుస్తక ప్రియులకు సాహిత్య మహా కుంభమేళా మరో పది రోజుల్లో ప్రారంభమవుతోంది. విశ్వం ఒక వసుధైక కుటుంబం అని చాటిచెప్పేందుకు ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జైపూర్ సాహిత్యోత్సవం (Jaipur Literature Frstival) 18వ ఎడిషన్‌కు రాజస్థాన్ రాజధాని జైపూర్ (Jaipur) ముస్తాబవుతోంది. 2025 జనవరి 30 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకూ జైపూర్‌లోని హోటల్ క్లార్క్ అమెర్ (Hotel clarks Amer)లో ఈ విశిష్టోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ప్రపంచ భాషలు, సంస్కృతీ సంపదలు, ప్రస్తుత పరిణామాలు, పుస్తక ప్రపంచంతో మమేకం కావాల్సిన అవసరం సహా తమ ఆలోచనలను అందరితో పంచుకునేందుకు విశిష్ఠ వేదకిగా జైపూర్ లిటరేచర్ ఫెస్టవిల్ నిలవనుంది. 'భూమిపై ఉన్న గొప్ప సాహిత్య ప్రదర్శన'గా అభివర్ణించే ఈ ఐదురోజుల ఉత్సవాల్లో ప్రపంచ రచయితలు, కవులు, మేథావులు, మానవతావాదులు, విశిష్ఠ సాహితీ అవార్డులు అందుకున్న ప్రముఖులు పాల్గొంటారు.
Maha Kumbh Mela 2025: జోరందుకున్న మహాకుంభ మేళా 2025.. ఈసారి టెక్నాలజీతో కూడిన
అస్సామీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ ఒడియా, సంస్కృతం, పంజాబీ, తమిళం, ఉర్దూ వంటి భాషల సాహిత్యంపై పలు సెషన్లు ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. 300 మందికి పైగా ప్రముఖ రచయిత, వక్తలు ఈ ఏడాది జరిగే ఫిల్మోత్సవ్‌లో చర్చలు, ఉపన్యాసాలు ఉంటాయని జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ (జేఎల్ఎఫ్) నిర్వహకులు ప్రకటించారు. వ్యక్తల జాబితా, సెషన్ల వివరాలను కూడా ప్రకటించారు.
ప్రతి సంవత్సరం తరహాలోనే ఈసారి కూడా సెరిబ్రల్ చర్చలు, పరిశీలాత్మక ప్రపంచ వీక్షణలకు జైపూర్ ఫెస్టివల్ వేదక కానుంది. ఇందుకు సంబంధించి రౌండ్ టేబుల్ సమావేశాలు ఉంటాయి. ఇంతవరకూ నిర్వాహకులు పలు సెషన్లు ప్రకటించారు. వీటిలో 'పూర్ ఎకనామిక్స్ ఫర్ ది యంగ్', 'అవర్ సిటీ దట్ ఇయర్', డేవిడే హరే: ఎ లైప్ ఇన్ థియేటర్ అండ్ ఫిల్మ్, 'ఇండియాస్ ఫస్ట్ డిప్లొమేట్స్', 'రోమన్ ఇయర్: ఎ మెమోరీ', 'కైరోస్ : ది హార్ట్ డివైడెడ్', 'ది పర్సనల్ ఈజ్ పొలిటికల్: యాన్ యాక్టివిస్ట్ మెమోరీ', 'వై ఉయ్ డై: ద న్యూ సైన్స్ ఆఫ్ ఏజింగ్ అండ్ ది క్వెస్ట్ ఫర్ ఇమ్మోర్టాలిటీ', 'ది అప్‌సైడ్-డౌన్ వరల్డ్: మీటింగ్ విత్ ది డచ్ మాస్టర్స్', 'అమోల్ పాలేకర్: ది వ్యూఫైండర్', 'టు సేజస్: గాంధీ అండ్ టాల్‌స్టాయ్', డీప్ వాటర్: ద వరల్డ్ ఇన్ ఇది ఓషన్', 'లాంగ్ అండ్ ది షార్ట్' వంటివి ఉన్నాయి.
ఏటా అనేక రకాల సాహిత్య ఇతవృత్తాలు, ఆలోచనలను అన్వేషించడానికి, రచయితలు, మేథావులు, వక్తల విభన్న ప్రపంచ సమాజాన్ని ఏకం చేయడానికి నిర్వహిస్తున్న సాహిత్యోత్సవం ఈసారి మరింత గొప్పగా నిర్వహిచనున్నట్టు జైఎల్ఎఫ్ కో డైరెక్టర్ నమిత గోఖలే తెలిపారు. మిస్టిక్స్, మ్యాడ్‌మన్ నుంచి ఎకనామిక్స్ ఫర్ యూత్, జియోపాలిటిక్స్ నుంచి పురాతన నలందా అకాడమీ వరకూ...ఇలా ప్రపంచంలోని కొత్త వండర్స్‌కు జైపూర్ ఫెస్టివల్ ప్రతిరోజూ వేదక కానుందన్నారు.ఫెస్టివల్‌కు సమాంతరంగా జైపూర్ బుక్ మార్క్ (జేబీఎం) 11వ ఎడిషన్ కూడా నిర్వహిస్తామని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ పబ్లిషర్లు, లిటరలీ ఏజెంట్లు, రచయితలు, ట్రాన్సలేటర్లు, ట్రాన్సలేషన్ ఏజెన్సీలు, బుక్ సెల్లర్స్ పాల్గొంటారని చెప్పారు.
కాగా జైపూర్ ఫెస్టివల్ సాహితీ సదస్సుల్లో పాల్గొనే ప్రముఖుల్లో సాహిత్యంలో నోబెల్ గ్రహీత వెంకీ రామకృష్ణ, చరిత్రకారుడు అనురుథ్ కనిసెట్టి, ఆస్ట్రేలియా రచయిత అన్న ఫుండెర్, రచయిత కావేరీ మాధవన్, భౌతిక శాస్త్రవేత్త క్లాడియ డి రామ్, బ్రిటిష్ నావలిస్ట్ డావిడ్ నికొల్లస్, రచయితి ఐ.ముఖోతి, రంగస్థల నటుడు మానవ్ కౌల్, కెనడా రచయిత జాన్ వైలాంట్, నైజీరియా నావలిస్ట్ ఐరెనోసేన్ ఒకోజి, పాత్రికేయుడు-రచయిత కల్లోల్ భట్టాచార్జి, హ్యారీపోటర్ నటి మిరియం మార్గోలిస్, అమెరికా రచయిత నాథన్ థ్రాల్, నావలిస్ట్ ప్రయాగ్ అక్బర్, రచయిత-ఫిల్మ్ మేకర్ ప్రియాంక మట్టూ, ఉక్రెయిన్ రచయిత యారోస్లవ్ ట్రోఫిమోవ్ తదితరులు ఉన్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
Fadnavis: మీరు ఏదో ఒక రోజు సీఎం అవుతారు.. అజిత్ పవార్‌పై ఫడ్నవీస్ వ్యాఖ్యలు
Sabarimala: శబరిమలలో మండల పూజకు సిద్ధం
Read More National News and Latest Telugu News