Home » Rajnath Singh
టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి కోసం వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి రంగంలోకి దిగిపోయారా..? డిప్యూటేషన్ పొడిగించాలని కేంద్ర మంత్రితోనే పైరవీలు చేస్తున్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇదే అక్షరాలా నిజం.
లోక్సభ ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషన్ శనివారంనాడు ప్రకటించడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. వెంటనే ప్రచారబరిలోకి దిగేందుకు జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. 7 విడతల్లో జరిగే పోలింగ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సహా పలువురి ప్రముఖులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఎన్నికల తేదీల వివరాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.
కొన్నేళ్లుగా చైనా సరిహద్దులో (China Border) నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా భారత్ (India) జోలికి వస్తే.. అందుకు ధీటుగా బదులిచ్చేందుకు సాయుధ బలగాలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. సవాళ్లు ఏ రూపంలో ఎదురైనా.. వేగంగా, సమర్ధవంతంగా స్పందించేందుకు భారత్ రెడీగా ఉందని తెలిపారు.
బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటి సమావేశం ముగిసింది. ఈ సమావేశం ఐదు గంటల పాటు కొనసాగింది. బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. తెలంగాణ సహా మొత్తం 9 రాష్ట్రాల్లో లోక్సభ అభ్యర్థులపై కసరత్తు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 125కు పైగా స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది.
తన ఏపీ పర్యటనలో భాగంగా వైసీపీ ప్రభుత్వంపై కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజన్ గానీ, వ్యవస్థ గానీ, సంకల్పం గానీ లేదని తూర్పారపట్టారు. కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర నిధులు ఏమవుతున్నాయో తెలియడం లేదని మండిపడ్డారు. ఇసుక మాఫియా, మద్యం మాఫియాలో రాష్ట్ర ప్రభుత్వం మునిగిపోయిందని ఆరోపణలు గుప్పించారు.
ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగిందని.. భవిష్యత్తులో ఏపీలో కూడా అధికారంలోకి వస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్(Rajnath Singh) అన్నారు. మంగళవారం నాడు ‘భారత్ రైజింగ్ అలైట్ మీట్’ పేరుతో బీజేపీ సమావేశం నిర్వహించింది.
అమరావతి: కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ మంగళవారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ఆయన గన్నవరం విమానాశ్రయానికి వస్తారు.
భారత నేవీని(Indian Navy) మరింత పటిష్టం చేసేందుకు రక్షణ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలతో యుద్ధ నౌకలు, ఆయుధాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్న భారత్ తాజాగా యుద్ధ విమానాల కొనుగోలుకు కూడా ముందుకొచ్చింది.
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో రైతుల నిరసనలు మూడో రోజు కొనసాగుతోన్నాయి. రైతు నేతలు, రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఆ క్రమంలో వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో వందల సంఖ్య రైతులకు గాయాలు అయ్యాయి.
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా దేశం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. రామనామ స్మరణతో దేశం మార్మోగిపోతోంది. ఇతర దేశాల్లోనూ రామ ప్రతిష్ఠ సంబురాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని దర్యా గంజ్లో గల శ్రీ సనాతన్ ధర్మ్ మందిర్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రార్థనలు చేశారు.