Lok Sabnha Elections 2024: వీఐపీ సీట్లలో కీలక పోలింగ్ తేదీలివే..
ABN , Publish Date - Mar 16 , 2024 | 09:20 PM
లోక్‌సభ ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషన్ శనివారంనాడు ప్రకటించడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. వెంటనే ప్రచారబరిలోకి దిగేందుకు జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. 7 విడతల్లో జరిగే పోలింగ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సహా పలువురి ప్రముఖులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఎన్నికల తేదీల వివరాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections 2024) తేదీలను ఎన్నికల కమిషన్ శనివారంనాడు ప్రకటించడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. వెంటనే ప్రచారబరిలోకి దిగేందుకు జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. 7 విడతల్లో జరిగే పోలింగ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సహా పలువురి ప్రముఖులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఎన్నికల తేదీల వివరాల్లోకి ఓసారి చూద్దాం.
1.మోదీ-వారణాసి.
-జూన్ 1న జరిగే 7వ విడతలో వారణాసిలో పోలింగ్ జరుగనుంది.
2.రాహుల్ గాంధీ-వయనాడ్
-ఏప్రిల్ 26న జరిగే 2వ విడతలో ఈ నియోజవర్గంలో పోలింగ్ ఉంటుంది.
3.అమిత్‌షా- గాంధీనగర్
-మే 7న జరిగే 3వ విడతలో పోలింగ్.
4.నితిన్ గడ్కరి-నాగపూర్
-ఏప్రిల్ 20న జరిగే 5వ విడత పోలింగ్.
5.స్మృతి ఇరానీ- అమేధీ
-మే 20న జరిగే 5వ విడత పోలింగ్
6.అసదుద్దీన్ ఒవైసీ- హైదరాబాద్
-మే 13న జరిగే 4వ విడత పోలింగ్
7.రాజ్‌నాథ్ సింగ్-లక్నో
-మే 20న జరిగే 5వ విడత పోలింగ్
8.పీయూష్ గోయల్-ముంబై నార్త్
-మే 20న జరిగే 5వ విడత పోలింగ్
9. శశిథరూర్-తిరువనంతపురం
-ఏప్రిల్ 26న జరిగే 2వ విడత పోలింగ్
10.బన్సూరి స్వరాజ్ (దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె)-న్యూఢిల్లీ
-మే 25న జరిగే 6వ విడత పోలింగ్