Home » Ram Charan
అభిమాని కుటుంబానికి సహాయం చెయ్యడానికి అప్పట్లో రామ్ చరణ్, అల్లు అర్జున్ (Allu Arjun) కర్నూల్ (Kurnool) వెళ్లి ఆ కుటుంబానికి సహాయం చేసారు. ఇది జరిగినది 2002 సంవత్సరంలో, ఇప్పుడు మళ్ళీ 20 సంవత్సరాల తరువాత, రామ్ చరణ్ (#RC15) మళ్ళీ కర్నూల్ వెళుతున్నాడు.
సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణికి ఆస్కార్ అకాడమీ (Oscar Academy) వాళ్ళు అవార్డులు జరిగే రోజున ఈ 'నాటు నాటు' పాటని లైవ్ (Live Music) లో ప్రదర్శించాలని ఆహ్వానం పంపారని ఒక టాక్ నడుస్తోంది.
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అడ్వాణీ (Kiara Advani), సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) పెళ్లి బంధంతో ఒకటైన విషయం తెలిసిందే.
కథానాయిక కియారా అడ్వాణీ పెళ్లి పనులు షురూ అయ్యాయి. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రను ఆమె పెళ్లాడనుంది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఈ నెల 6న వివాహబంధంతో ఒకటి కానున్నారు. రాజస్థాన్- జైసల్మీర్‌లోని సూర్యఘర్ ప్యాలెస్‌లో ఈ వివాహానికి వేదిక కానుంది.
పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో సత్తా చాటిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది. 95వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ నామినేషన్‌ను దక్కించుకుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని గెలుచుకుంది.
బాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ (Farah Khan) ‘ఆర్ఆర్ఆర్’ పై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ చిత్రానికి ఆస్కార్ వచ్చే అవకాశం ఉందని చెప్పింది. ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటలోని డ్యాన్స్ స్పెషల్ ఎఫెక్ట్స్‌తో చేసినట్టు ఉంటుందని స్పష్టం చేసింది.
హాలీవుడ్ మ్యాగజైన్ యుఎస్ఏ టుడే ఉత్తమ నటనను కనబరిచిన 10మంది నటీ, నటుల జాబితాను వెల్లడించింది. వారికి ఆస్కార్ వస్తే బాగుంటుందని చెప్పింది. ఈ లిస్ట్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కు చోటు దక్కడం విశేషం.
‘ఆర్ఆర్ఆర్’ (RRR) కు ఇండియా తరఫున ఆస్కార్ ఎంట్రీ రాకపోవడంతో నిరాశ చెందానని చిత్ర దర్శకుడు ఎస్ఎస్. రాజమౌళి (SS.Rajamouli) అన్నారు. సినిమాను ఎంట్రీగా పంపిస్తే పురస్కారం వచ్చే ఛాన్స్ అధికంగా ఉండేదని చెప్పారు.
ఇండియాకు చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలాని (Designer Tarun Tahiliani డిజైన్ చేసిన క్లాసిక్ డ్రెస్‌ను ధరించి మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (#MegaPowerStarRamCharan) అందరి దృష్టిని ఆకర్షించారు.
ఆర్ఆర్ఆర్ సినిమా అనేక ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో సత్తా చాటిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం సినీ ప్రపంచంలోనే విశిష్ట పురస్కారమైన గోల్డెన్ గ్లోబ్‌ను కైవసం చేసుకుంది. బెస్ట్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ (Naatu Naatu) అవార్డును సొంతం చేసుకుంది.