Ram charan: క్యాన్సర్ బాధితుడిగా భరోసాగా..!
ABN , First Publish Date - 2023-02-09T23:56:28+05:30 IST
క్యాన్సర్‌తో పోరాడుతున్న తొమ్మిదేళ్ల వయసున్న అభిమాని గురించి తెలుసుకున్న మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ చలించిపోయారు. ఆ చిన్నారిని కలిసి, మానసిక ధైర్యాన్నిచ్చారు.
క్యాన్సర్‌తో పోరాడుతున్న తొమ్మిదేళ్ల వయసున్న అభిమాని గురించి తెలుసుకున్న మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ (Ram charan) చలించిపోయారు. ఆ చిన్నారిని కలిసి, మానసిక ధైర్యాన్నిచ్చారు. మణి కుశాల్ (mani kushal) అనే కుర్రాడు క్యాన్సర్‌కు గురై, హైదరాబాద్‌లోని స్పర్శ్ హాస్పిస్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ పొందుతున్నాడు. (Ram charan meets cancer patients) అతడికి రామ్‌చరణ్ అంటే బాగా ఎంతో అభిమానం. ‘చరణ్‌ను నేను చూడాలి’ అంటూ ఆ చిన్నారి తన కోరికను బయటపెట్టాడు. ఆ విషయం తెలుసుకున్న చెర్రీ హైదరాబాద్‌లో ఆర్‌సీ15 చిత్రీకరణతో బిజీగా ఉన్నా.. ఆస్పత్రికి వెళ్లి అభిమానిని కలిశారు. ఓ బహుమతి ఇచ్చారు. మణి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబానికి భరోసాగా ఉంటానని మాటిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. (Ram charan)