Oscars2023: నాటు నాటు చరిత్ర సృష్టించనుందా...

ABN , First Publish Date - 2023-02-08T15:17:35+05:30 IST

సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణికి ఆస్కార్ అకాడమీ (Oscar Academy) వాళ్ళు అవార్డులు జరిగే రోజున ఈ 'నాటు నాటు' పాటని లైవ్ (Live Music) లో ప్రదర్శించాలని ఆహ్వానం పంపారని ఒక టాక్ నడుస్తోంది.

Oscars2023: నాటు నాటు చరిత్ర సృష్టించనుందా...

ఈ సంవత్సరం ఆస్కార్స్ (Oscars2023) లో రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన 'ఆర్.ఆర్.ఆర్' (RRR) సినిమాలోని తెలుగు పాట 'నాటు నాటు' (Natu Natu song) నామినేషన్ లో వుంది. దీనికి ఎం.ఎం. కీరవాణి (M.M. Keeravani) సంగీత దర్శకుడు కాగా, చంద్రబోస్ (Chandrabose) ఈ పాటను రాయటం జరిగింది. అయితే ఆస్కార్ నామినేషన్ లో ఉండటం కూడా ఒక గొప్ప ఘనతని సాధించినాట్టే, ఎందుకంటే ఇంతవరకు ఆ నామినేషన్ వరకు వెళ్లిన భారత దేశ సినిమాలు వేళ్ళమీద లెక్కించవచ్చు. తెలుగు సినిమా అయితే మొదటిసారి ఆ ఘనత సాధించింది. మరి తెలుగు పాట కనక ఈసారి ఆస్కార్ గెలిస్తే (Oscar Award), అది చరిత్ర సృష్టించినట్టే. ఇప్పుడు భారత దేశం అంతా ఈ ఆస్కార్ అవార్డులు జరిగే మార్చి 12 వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. (#Oscars2023)

natunatu1.jpg

ఇక్కడో చిన్న ట్విస్ట్ కూడా వుంది. సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణికి ఆస్కార్ అకాడమీ (Oscar Academy) వాళ్ళు అవార్డులు జరిగే రోజున ఈ 'నాటు నాటు' పాటని లైవ్ (Live Music) లో ప్రదర్శించాలని ఆహ్వానం పంపారని ఒక టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇదే నిజం అయితే తెలుగు పాటకి ఆస్కార్ వచ్చినట్లే అని పరిశ్రమలో అంటున్నారు. ఎందుకంటే ఎవరికీ అయితే ఆస్కార్ వస్తుందో వాళ్ళని మాత్రమే ఇలా పిలిచి అక్కడ లైవ్ లో ప్రదర్శన ఇమ్మంటారు అని అంటున్నారు. ఇంతకు ముందు ఏ.ఆర్. రహమాన్ (AR Rahaman) ని కూడా ఇలాగే ఆహ్వానించి లైవ్ ప్రదర్శన ఇప్పించారు అని, ఆ వేడుకలో అదే సంవత్సరం అతనికే అవార్డు వచ్చిందని అంటున్నారు. అందువల్ల ఇప్పుడు కీరవాణికి కూడా ఆహ్వానం రావటం ఖాయం అని అనుకుంటే 'నాటు నాటు' పాటకి అవార్డు కూడా ఖాయం అంటున్నారు. ఈ పాటలో రామ్ చరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఇద్దరూ అద్భుతమయిన డాన్స్ పెర్ఫార్మన్స్ చేశారు.

Updated Date - 2023-02-08T15:17:37+05:30 IST