Home » Rammohannaidu Kinjarapu
కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు (Rammohan Naidu) - మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఏపీ అభివృద్ధిపై పలు కీలక అంశాలపై చర్చించారు.
దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎయిర్‌లైన్ హబ్‌గా మారుస్తామని పౌరవిమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు వెల్లడించారు.
శ్రీకాకుళం: ఐదేళ్లలో రాష్ట్రంలో వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయని, కొన్ని శాఖల అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కక్ష సాధింపులు ఉండవని వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన శ్రీకాకుళంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
కేంద్ర రాష్ట్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన కింజరాపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడులకు శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఆత్మీయ అభినందన సభ జరిగింది. శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్న ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నేడు శ్రీకాకుళం జిల్లాకు రాష్ట్ర, కేంద్ర మంత్రులైన బాబాయి, అబ్బాయి రానున్నారు. రాష్ట్ర మంత్రివర్యులు కింజారపు అచ్చెన్నాయుడు, కేంద్ర విమానయాన శాఖామాత్యులు కింజారాపు రామ్మోహన్ నాయుడు నేడు జిల్లాకు రానున్నారు. ఉదయం 9.30 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయం చేరుకుని అక్కడ నుంచి ర్యాలీ గా బయలుదేరనున్నారు.
టీడీపీ యంగ్ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని తన కార్యాలయంలో మధ్యాహ్నం 01:10 గంటల సమయంలో కేంద్ర పౌర విమానా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. దేశంలో అత్యంత పిన్న వయసులో..
ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారోత్సవ సందడి నెలకొంది. బుధవారం ఉదయం 11.27 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు నారా, నందమూరి, మెగా కుటుంబ సభ్యుల్లో పలువురు ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు.
న్యూఢిల్లీ: పౌర విమానయాన శాఖ తనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏరి కోరి అప్పగించారని, అంతర్జాతీయ స్థాయిలో భారత దేశ కీర్తి ప్రతిష్టలను పెంపొందించడంలో ఈ శాఖ పాత్ర చాలా ఉందని తెలుగుదేశం ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆయన కేబినెట్ సమావేశమైంది. న్యూఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో సోమవారం నిర్వహించిన ఈ సమావేశానికి 71 మంది మంత్రులు హాజరయ్యారు.
కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ యువనేత కింజరాపు రామ్మోహన్నాయుడు (37) టీడీపీ సీనియర్ నేతల్లో అగ్రగణ్యుడు, కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడి కుమారుడు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆయ న.. అతిచిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చారు.