Share News

Ram Mohan Naidu: జగన్ హయాంలో మరోస్కాం.. సంచలన విషయాలు బయటపెట్టిన రామ్మోహన్ నాయుడు

ABN , Publish Date - Dec 24 , 2024 | 06:48 PM

Ram Mohan Naidu Kinjarapu: జలజీవన్ మిషన్, హౌసింగ్ పథకాల్లో అధికారిక లెక్కలకు క్షేత్ర స్థాయి పనులకు పొంతన లేదని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో అనేక అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. నాటి ప్రభుత్వ వైఫల్యాలు నేటికీ వెంటాడుతున్నాయని చెప్పారు.

Ram Mohan Naidu: జగన్ హయాంలో  మరోస్కాం.. సంచలన విషయాలు బయటపెట్టిన  రామ్మోహన్ నాయుడు
Ram Mohan Naidu Kinjarapu

శ్రీకాకుళం: జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తున్నామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు నేతృత్వంలో దిశా సమీక్షా సమావేశం ఇవాళ(మంగళవారం) నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో 20 సూత్రాల పథకం చైర్మన్ లంకా దినకర్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. తమకు రాజకీయ, వ్యక్తిగత కక్షలు ఉండవని చెప్పారు. జలజీవన్ మిషన్, హౌసింగ్ పథకాల్లో అధికారిక లెక్కలకు క్షేత్ర స్థాయి పనులకు పొంతన లేదన్నారు.వైసీపీ ప్రభుత్వంలో అనేక అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. నాటి ప్రభుత్వ వైఫల్యాలు నేటికీ వెంటాడుతున్నాయని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.


కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగంపై దిశా సమావేశంలో చర్చించామని అన్నారు. రాష్ట్రం, కేంద్రంలోనూ ఎన్డీయే ప్రభుత్వం ఉండటం ఏపీకి ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో సమస్యలు పరిష్కరించుకుంటామని తెలిపారు. అటల్ బీహారీ వాజపేయి జయంతి కార్యక్రమం ఢిల్లీలో ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారని తెలిపారు. వాజ్‌పేయి మంచి సంస్కరణ వాది అని చెప్పారు. చంద్రబాబు, వాజపేయి కాంబినేషన్లో అనేక సంస్కరణలకు నాంది పలికారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Nadendla Manohar: ఆ చట్టంపై అవగాహన ఉండాలి

Chandrababu Naidu: ఈరోజు ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు.. కారణమిదే..

YCP: వైసీపీని లేకుండా చేయాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు: సజ్జల రామకృష్ణారెడ్డి

Minister Nara Lokesh : శ్యామ్‌ బెనగల్‌ మృతికి లోకేశ్‌ సంతాపం

Read Latest AP News And Telugu news

Updated Date - Dec 24 , 2024 | 06:50 PM