Home » Ranga Reddy
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(HYDRA) దూసుకెళ్తోంది. హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాల్లో కొరడా ఝుళిపిస్తోంది. అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తూ ఆక్రమణదారుల గుండెల్లో నిద్రపోతోంది.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వరసగా అదృశ్యం కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా చిన్నారుల అపహరణ కేసులు పెరిగిపోతున్నాయి. పురిటి బిడ్డలను కూడా వదలడం లేదు. ఏదో ఒకటి ఆశ చూపి అభశుభం తెలియని పసివారని ఎత్తుకెళ్లిపోతున్నారు. గత వారం రోజుల వ్యవధిలోనే పలు కిడ్నాప్ కేసులు నమోదు అయ్యాయి.
హైదరాబాద్: అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం కిడ్నాప్‌కు గురైన బాలిక ప్రగతి (6) ఆచూకీ లభ్యమైంది. రంగారెడ్డి జిల్లా, కొత్తూరు మండలం ఇనుమూల్ స్వ గ్రామంలో కిడ్నాపర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కు తరలించారు.
శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఎస్ఓటీ పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పెద్ద అంబర్పేట్ మీదుగా గచ్చిబౌలి వైపు కంటైనర్‌లో తరలిస్తున్న దాదాపు 800కిలోల గంజాయిని పట్టుకున్నారు. కంటైనర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Telangana: మద్యం సేవించి వాహనాలు నడుపరాదు అంటూ పోలీసులు ఎప్పటిప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉంటారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌ను అరికట్టేందుకు అనేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. వీకెండ్లలో అయితే పలు చోట్ల చెక్‌పోస్టులు నిర్వహించి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వారిని పట్టుకుని... వారికి కౌన్సిల్ ఇస్తుంటారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో ఆయన పర్యటించనున్నారు. లష్కర్‌గూడలో జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నందున దీనికి సంబంధించిన ఏర్పాట్లను బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి శనివారం పరిశీలించారు.
తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా బి. సాల్మన్ నాయక్ ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండల వ్యవసాయశాఖ అధికారిగా పనిచేస్తున్న సాల్మన్ నాయక్‌ను..
రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్ మండలం మైసిగండి మైసమ్మ అమ్మవారి గర్భగుడిలో ఈరోజు(ఆదివారం) అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మధ్యాహ్నం పూజారులు అమ్మవారికి పూజ నిర్వహిస్తున్న సమయంలో గర్భగుడిలోని దేవతామూర్తిపై సూర్యకిరణాలు నిలువుగా ప్రసరించాయి. ఈ దృశ్యం చూసిన పూజారులు, భక్తులు మంత్రముగ్ధులయ్యారు.
యాభై మంది పనిచేస్తున్న పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగి మంటల్లో చిక్కుకుంటే.. అత్యంత సాహసోపేతంగా వ్యవహరించి ఐదుగురి ప్రాణాలు కాపాడాడో 16 ఏళ్ల బాలుడు! రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో జరిగిందీ ఘటన.
రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్‌లో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హరిని అనే బాలిక ఇంటర్ మొదటి సంవత్సరంలో ఓ సబ్జెక్టులో ఫెయిల్ అయింది. దీంతో తీవ్ర మనస్థాపం చెంది గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. క్షణికావేశంలో విద్యార్థిని నిర్ణయం తీసుకుంది. దీంతో బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.