రంగారెడ్డి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం
ABN, Publish Date - Apr 04 , 2025 | 03:19 PM
Bird Flu: రంగారెడ్డి జిల్లాలో బర్డ్ ఫ్లూతో ఫౌల్ట్రీ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో నివారణ చర్యలు చేపట్టారు అధికారులు.
రంగారెడ్డి, ఏప్రిల్ 4: జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో బర్డ్ ఫ్లూ (Bird Flu) కలకలం రేపడంతో అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. ఓ ఫౌల్ట్రీ ఫాంలో వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. నాలుగు రోజుల క్రితం చనిపోయిన కోళ్ల నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు అధికారులు. బర్డ్ ఫ్లూ అని అధికారులు నివేదిక ఇవ్వడంతో పౌల్ట్రీ ఫాం యజమానులు ఆందోళన చెందుతున్నారు. కోట్లలో ఆస్తి నష్టం సంభవిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోసారి అదే ప్రాంతంలో అధికారులు శాంపిల్స్‌ను సేకరించారు.
పౌల్ట్రీ ఫాంలో అధికారులు మందులు చల్లించారు. చనిపోయిన కోళ్లను జేసీబీ సాయంతో పూడ్చిపెట్టారు. కోడిగుడ్లను అమ్మ వద్దని పౌల్ట్రీ యజమానులను అధికారులు ఆదేశించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
Pharmacist Death: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మసిస్ట్ కన్నుమూత
Crime On Train Washroom: ట్రైన్ వాష్‌రూమ్‌లో బాలికపై దారుణం
Read Latest Telangana News And Telugu News
Updated at - Apr 04 , 2025 | 03:19 PM