Home » Republic Day 2024
ఢిల్లీలో నిర్వహించే ముందస్తు గణతంత్ర వేడుకల్లో పాల్గొనేం దుకు పెదతాడేపల్లి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు గురువారం విమానంలో ఢిల్లీ బయల్ధేరినట్టు ప్రిన్సిపాల్ బి.రాజారావు తెలిపారు.
జిల్లాలో గణతంత్ర దినోత్సవ నిర్వహణకు అవసరమైన పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లాలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించేం దుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ అధికారులను ఆదేశించారు.
న్యూఢిల్లీ: సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఈ నెల 26న ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో తెలగాణ శకటం ప్రదర్శనకు చోటు దక్కింది. 2015-2020 అనంతరం మళ్లీ ఈ ఏడాదే రాష్ట్ర శకటం ఢిల్లీ వేడుకల్లో కనువిందు చేయనుంది.
ప్రతి ఏడాదిలాగే ఈ గణతంత్ర దినోత్సవానికి(India Republic Day 2024) ఢిల్లీలో జరిగే పరేడ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ముఖ్య అతిథి రాబోతున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్(Emmanuel Macron)కు ఈ మేరకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు మహిళలు రిపబ్లిక్ డే వేడుకలకు అటెండ్ అవుతారు. వారిలో ఒకరు స్వీపర్ నారాయణమ్మ కాగా మరొకరు మొబైల్ షీ టాయిలెట్ నిర్వాహకురాలు నాగలక్ష్మీ. వీరిద్దరిని రిపబ్లిక్ డే వేడుకల కోసం జీహెచ్ఎంసీ అధికారులు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులుగా ఢిల్లీ పంపించారు.
స్థానిక తలారిసింగి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ఆవరణలో ఈ నెల 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను మంగళవారం ఐటీడీఏ పీవో వి.అభిషేక్ పరిశీలించారు.
యావత్ భారతావని గణతంత్ర వేడుకలు (Republic Day 2024) ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఢిల్లీలో జరగనున్న వార్షిక వేడుకలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన రెండు రోజులపాటు జరుగుతాయి.
దేశ రాజధాని దిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దిల్లీలోని11 జోన్లలో 11 మంది డీసీపీలు, 8000 మంది పోలీసులు పహారా కాస్తున్నారు.
భారత 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మ గురువారం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాక జాతినుద్దేశించి ఆమె ప్రసంగించడం ఇది రెండోసారి.