Home » Republic day
రామ మందిర ప్రారంభోత్సవ వేళ పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లక్నో, నోయిడా, గ్రేటర్ నోయిడాలో 144 సెక్షన్ విధించారు.
నగరంలోని పబ్లిక్ గార్డెన్స్‌లో ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ( CS Shanti Kumari ) బుధవారం డా.బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను రిపబ్లిక్ డే రోజున హతమారుస్తామని ఖలిస్థాన్ ఉగ్రవాది హెచ్చరించారు. ఆ దాడికి గ్యాంగ్స్టర్లు ఏకం కావాలని గుర్పత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చరించారు.
కొత్త మొబైల్ కొనాలనుకుంటున్నారా? మంచి ఆఫర్ల కోసం చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. మరికొద్ది రోజుల్లో ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం కాబోతోంది. ఫ్లిప్‌కార్ట్ సేల్ జనవరి 14వ తేదీన ప్రారంభమై 19 వరకు కొనసాగుతుంది. ఫ్లిప్‌కార్ట్ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో రాబోయే సేల్ ఈవెంట్ టీజర్ పోస్ట్ అయింది.
గణతంత్ర దినోత్సవం(Indian Republic Day 2024) అనగానే గుర్తొచ్చేది ఢిల్లీలో జరిగే కవాతు. భారత్ త్వరలో 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్న సందర్భంగా దేశ రాజధాని ముస్తాబవుతోంది. జనవరి 26న ఉదయం 9:30 గంటలకు విజయ్ చౌక్ నుండి కవాతు ప్రారంభమై ఐదు కిలోమీటర్లకు పైగా సాగి, నేషనల్ స్టేడియం వద్ద ముగుస్తుంది.
Telangana: 2024 గణతంత్ర దినోత్సవ కవాతుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర శకటాలు ఎంపికయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో చివరి నిమిషంలో తెలంగాణ శకటం ఎంట్రీ సాధించింది. మదర్ ఆఫ్ డెమోక్రసీ పేరిట ఈ ఏడాది తెలంగాణ శకటం ఆకట్టుకోనుంది. చిట్యాల(చాకలి) ఐలమ్మ, కుమరం భీం జీవితాల థీమ్‌కు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది.
రిపబ్లిక్ డే పరేడ్-2024లో శకటాల ప్రదర్శనకు పంజాబ్ శకటానికి చోటు దక్కకపోవడంపై మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ చర్య పంజాబ్ పట్ల కేంద్రానికి ఉన్న వివక్షను చాటుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ చేసిన వ్యాఖ్యాలను కేంద్ర రక్షణ శాఖ ఆదివారంనాడు తోసిపుచ్చింది. మాస్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని తెలిపింది.
భారత గణతంత్ర వేడుకలకు(India RepublicDay) హాజరుకావాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. బాస్టిల్ డే పరేడ్‌లో పాల్గొనేందుకు జులైలో ప్రధాని మోదీ ఫ్రాన్స్ లో పర్యటించారు.
రిపబ్లిక్ డే-2024 సందర్భంగా అందించే రాష్ట్రపతి మెడల్ అవార్డులకు త్వరితగతిన పేర్లు సిఫారసు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను మరోసారి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరింది. ఈ మేరకు ఈనెల 24న రెండో లేఖ రాసింది. ఏటా ప్రెసిడెంట్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్, మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ కింద రాష్ట్రపతి మెడల్స్‌ను రిపబ్లిక్ డే సందర్భంగా ప్రదానం చేస్తుంటారు.
మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరిగాయి.