Share News

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు స్ట్రాంగ్ వార్నింగ్

ABN , Publish Date - Nov 06 , 2024 | 05:48 PM

సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేస్తున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఆపాలని అతడికి సూచిస్తున్నారు. లేకుంటే బీసీలతో చెప్పు దెబ్బలు తినాల్సిన పరిస్థితి తీన్మార్ మల్లన్నకు వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు స్ట్రాంగ్ వార్నింగ్

హైదరాబాద్, నవంబర్ 06: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యవహార శైలితోపాటు ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై ఆ పార్టీలోని పలువురు కీలక నేతలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కార్పొరేష్ల చైర్మన్లు బుధవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. తీన్మార్ మల్లన్న వెనుక ఎవరున్నారో తమకు తెలుసునన్నారు. మల్లన్న వెనుక కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉన్నారని వారు ఆరోపించారు.

karthika Masam 2024: కార్తీక మాసంలో పాటించ వలసిన నియమాలు.. పఠించ వలసిన స్తోత్రాలు


పార్టీకి ద్రోహం చేస్తున్నాడు..

కొందరితో చేతులు కలిపి కాంగ్రెస్ పార్టీకి మల్లన్న అన్యాయం చేస్తున్నాడని వారు మండిపడ్డారు. ఏదో ఆశించి అది కాకపోయే సరికి మల్లన్న ఇదంతా చేస్తున్నాడని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల గురించి మాట్లాడడానికి మల్లన్న ఎవరు? అని వారు ఈ సందర్భంగా ప్రశ్నించారు. మల్లన్న తమకు నాయకుడు కావాలని ప్రయత్నం చేస్తున్నాడంటూ అతడిపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా మైలేజ్ కోసమే మల్లన్న ఈ విధంగా చేస్తున్నాడని పేర్కొన్నారు.

Also Read: డొనాల్డ్ ట్రంప్‌కు వెల్లువెత్తిన అభినందనలు


బీసీలు చెప్పుతో కొడతారు..

మల్లన్న బీసీలకు నాయకుడు కాదని వారు స్పష్టం చేశారు. బీసీలకు అన్యాయం జరిగితే తాము ఊరుకుంటామా అని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నించారు. సరైన సమయంలో మల్లన్నపై చర్యలు ఉంటాయని వారు స్పష్టం చేశారు. మీరు మాట్లాడేది తప్పు అంటూ తీన్మార్ మల్లన్నకు ఈ సందర్భంగా వారు హితవు పలికారు. ఈ తరహా వ్యాఖ్యలు మానుకోకుంటే.. మల్లన్నను బీసీలు చెప్పుతో కొడతారని హెచ్చరించారు. రాజ్యాధికారంలో వాటా కోసం తాము సైతం కొట్లాడుతామని ఈ సందర్బంగా వారు స్పష్టం చేశారు.

Also Read: డొనాల్డ్ ట్రంప్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు


మిర్యాలగూడ సభలో..

నవంబర్ 03వ తేదీ. అంటే ఆదివారం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో బీసీ గర్జన సభ నిర్వహించారు. ఈ సభలో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు ఆయన కేబినెట్‌లోని మంత్రులను లక్ష్యంగా చేసుకుని ఘాటైన విమర్శలు గుప్పించారు. ఆ క్రమంలో ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అన్ని కోట్ల రూపాయిల ఆస్తులు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఇవన్నీ ప్రాజెక్టుల పేరుతో ప్రజల సొమ్మును దోచుకున్నారంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై తీన్మార్ మల్లన్న మండిపడ్డారు.


చివరి ఓసీ సీఎం, ఓసీ ఎమ్మెల్యే..

అలాగే రాష్ట్రానికి ఓసీ సీఎం రేవంత్ రెడ్డి.. అదే విధంగా మిర్యాలగూడకు ఓసీ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి ఇదే ఆఖరంటూ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన తీన్మార్ మల్లన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.. అవుతుంది. దీంతో తీన్మార్ వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్ పార్టీలోని పలువురు నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఎన్నికల ముందు తీన్మార్ మల్లన్న పార్టీలోకి వచ్చారని.. అనంతరం ఆయనకు ఎమ్మెల్సీ పదవి కేటాయించామని ఆ పార్టీ నేతలు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.


మల్లన్న వెనుక ఆ పార్టీ నేతలు..

అలాంటి తీన్మార్ మల్లన్న.. పదవి ఇచ్చిన పార్టీపైనే విమర్శలు గుప్పించడం ఏ మాత్రం సంస్కారం కాదనే అభిప్రాయం అయితే అధికార పార్టీలోని పలువురు నేతలు నుంచి వస్తుంది. మరోవైపు తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇంకోవైపు తెలంగాణలోని పలువురు బీజేపీ పెద్దలు తీన్మార్ మల్లన్న వెనుకు ఉండి ఈ కథ నడిపిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

For Telangana News And Telugu News...

Updated Date - Nov 06 , 2024 | 07:46 PM