Home » Revanth
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై కామెంట్స్ చేశారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ మానసిక పరిస్థితిని అర్థం చేసుకోగలనని, ఎడవలేక, పట్టిన చెమట తుడుచుకోలేక ఇబ్బంది పడుతున్నారన్నారు.
హైదరాబాద్: జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాలకు కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, వెంట కోమటిరెడ్డి, మల్లు రవి, చిన్నారెడ్డి తదితరులు వెళ్లారు. ముందు జూపల్లితో చర్చలు జరిపారు. తర్వాత పొంగులేటి నివాసంలో రెండు గంటల పాటు చర్చలు జరిపారు.
ఎందుకోగానీ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లిలు కాంగ్రెస్ పార్టీ నేతలతో మీటింగ్‌ల మీద మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. అయితే వారిద్దరూ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారో ఏమో కానీ పార్టీలో చేరికపై ప్రకటన మాత్రం చేయడం లేదు. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో మరోసారి పొంగులేటి, జూపల్లిల భేటీ జరగనుంది.
బీఆర్ఎస్ బహిష్కృతనేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. జూబ్లీహిల్స్‌లోని పొంగులేటి నివాసంలో భేటీ అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్‌లోకి పొంగులేటి దాదాపు ఖరారు కావడంతో పలు అంశాలపై చర్చించనున్నారు. పొంగులేటి తో పాటు ఎవరెవరు పార్టీలో చేరబోతున్నారు అనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ అమెరికా నుంచి వచ్చిన తరువాత పొంగులేటి చేరిక ఉండే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి భేటీ తరువాత అన్ని విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నానన్నారు. కుటుంబ సభ్యులకు నారా లోకేష్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
హైదరాబాద్: అభయ హస్తం పేరుతో ఐదు ప్రధాన అంశాలతో ప్రజల దగ్గరికి వెళ్తామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కత్రియ హోటల్ వద్ద మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 17న మేనిఫెస్టో విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
హైదరాబాద్: టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘నాది ఆంధ్ర అయితే.. మరి సోనియా గాంధీ ఎక్కడ..? ఆమెది ఇటలీ కదా’ అని ప్రశ్నించారు.
వివేక్ (Vivek), ఈటల (Etala), విశ్వేశ్వర రెడ్డి (Visveswara Reddy) లాంటి వాళ్ళు కాంగ్రెస్ (Congress)లోకి రావాలని ఆహ్వానిస్తున్నమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త సంవత్సరంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు.
హైదరాబాద్: తాజాగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు.